బాలయ్య విరాళం : 30 లక్షలు+15 లక్షల సరుకులు
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఒక్కరొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు భారీ విరాళాలు ప్రకటిచగా...తాజాగా బాలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 30 లక్షల విరాళంతో పాటు, 15 లక్షల విలువైన బియ్య, నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు ప్రకటించారు.
హుధూద్ తుఫాన్ బాధుతుల కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగార్జున, ప్రభాస్, నితిన్, రవితేజ ఇలా స్టార్ హీరోలంతా తమవంతు సహాయం చేయడానికి ముందు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం టాలీవుడ్ హీరోలైన పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం, మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. మరో వైపు జూ ఎన్టీఆర్ 20 లక్షలు, అల్లు అర్జున్ 20 లక్షలు, ప్రభాస్ 20 లక్షలు, కృష్ణ 15 లక్షలు, విజయనిర్మల 10 లక్షల, అక్కినేని ఫౌండేషన్ తరుపున నాగార్జున 20 లక్షలు, రవితేజ 10 లక్షలు, నితిన్ 10 లక్షల చొప్పున విరాళం అందించారు. మరో వైపు రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు, విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం రూ. 5 లక్షలు విరాళం అందించారు.
తెలుగు సినీ నిర్మాతల మండలి కూడా తమవంతుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. ఎలాంటి సహాయమైనా చేయడానికి తెలుగు సినీ పరిశ్రమ ముందు ఉంటుందని నిర్మాతలు దిల్ రాజు, బండ్ల గణేష్, సాగర్ తదితరులు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











