Rudrangi: కేసీఆర్‌పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయనను గారు అనను.. వెనుక నుంచి **స్తారు అంటూ!
దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్‌తో తిరుగులేని శక్తిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అలాగే, వేరే సినిమాలను సైతం ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జగపతి బాబు నటించిన 'రుద్రంగి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు వదిలారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
రుద్రంగి అంటూ వస్తున్నారు: జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన పిరియాడిక్ యాక్షన్ చిత్రమే 'రుద్రంగి'. అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన ఈ సినిమాను రసమయి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమాకు AIS Nawfalraja సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రం జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్: 'రుద్రంగి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు కూడా వస్తారని ప్రకటించినా.. ఆయన అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు. ఇక, ఈ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. దీనికి ఎంతో మంది అభిమానులు విచ్చేసి తెగ సందడి చేసేశారు.
బాలయ్య మార్క్ స్పీచ్‌తోనే: 'రుద్రంగి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా విచ్చేసిన నటసింహా నందమూరి బాలకృష్ణ తనదైన మేనరిజం, స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ముందుగా తనదైన రీతిలో తెలంగాణ యాసతో కూడిన ఓ మాస్ డైలాగ్‌ను వదిలారు. ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని చూపిస్తూ చివరి వరకూ మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఈవెంట్‌లో బాలయ్య తొలిసారిగా అదిరిపోయే కామెడీ పంచ్‌లు వేశారు.

వెనుక చూసి మేస్తారు అని: 'రుద్రంగి' ఈవెంట్‌లో బాలయ్య ముందుగా 'మా అయ్య ఎప్పుడూ ఓ మాట చెప్తుండే వాడు. ఇప్పుడు ఏడుండో కానీ.. మన గురించి మనం చెప్పుకునేటప్పుడు.. మన ముందు వాడున్నాడు.. వెనుక వీడున్నాడు.. గా ముచ్చట కాదు. మనం ముందు ఏం చేశాము.. వెనుక నుంచి ఎవర్ని మేసినాము గా ముచ్చట చెప్పుకోవాలే' అని చెప్పారు. ఇక, ఈ డైలాగ్‌పై ట్రోల్స్ వస్తున్నాయి.

మాకు రాజకీయాలు తెలీదు: ఇదే ఈవెంట్‌లో నిర్మాత, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై బాలయ్య ప్రశంసలు కురిపించారు. 'ఆ డైలాగ్ మా సోదరుడు గురించే చెప్పా. మాది రాజకీయ రంగమే. కానీ, మాకు రాజకీయాలు తెలీవు. ఆయనలో ఎంతో మంచితనం ఉంది. ఆయనను నేను గారు అనను. ఎందుకంటే ఆయన కూడా బాలకృష్ణే.. నేనూ బాలకృష్ణే. ఆయన్ని అంటే నన్ను అనుకున్నట్లే' అన్నారు.

కేసీఆర్‌కు ధన్యవాదాలు: 'రుద్రంగి' ఈవెంట్‌లో బాలయ్య 'బాలకిషన్‌ను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అందుకు గానూ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అచ్చమైన తెలుగు అమ్మాయిలా.. ఈయన అచ్చమైన కళాపోషకుడు. రసమయి బాలకిషన్ నా సోదరుడితో సమానం' అని చెప్పారు. ఇక, ఈ సందర్భంగా కేసీఆర్‌పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











