ఇద్దరు కృష్ణులు!!!
రంగా పాండురంగా సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్ర శ్రీకృష్ణుని పాత్ర కాగా మరొకటి భక్తుడి పాత్ర. ఇదిలా ఉంటే నాగార్జున కూడా దేవుని పాత్రలో కనిపించబోతున్నాడు. విష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రంలో నాగార్జున శ్రీకృష్ణుని పాత్రలో కనిపించబోతున్నాడు. నిజంగా శ్రీ కృష్ణుని పాత్రలో కాదుకానీ శ్రీకృష్ణునికి ప్రతిరూపం అన్నమాట. ఈ సినిమా హాలివుడ్ బ్రూస్ అల్మైటీ సినిమా ఆధారంగా రూపొందుతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఆంగ్ల చిత్రంలో మోర్గాన్ ఫ్రీమాన్ పోషించిన పాత్ర అన్నమాట. ఒకే దేవుడు రూపాలు వేరు. ప్రేక్షకులు ఎవరిని ఇష్టపడతారో మరి.


Click it and Unblock the Notifications