డబ్బింగ్ చెప్పుకుంటున్న బాలకృష్ణ
తాజాగా 'శ్రీరామ రాజ్యం' చిత్రాన్ని హిందీలోకి అనువదిస్తున్నారు. ఈ మేరకు తన పాత్రకు హిందీ డబ్బింగ్ చెబుతున్నారు బాలయ్య. త్వరలోనే ఈచిత్రం హిందీలో విడుదల కానుంది. బాపు దర్శకత్వంలో పాు, ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం, బాలయ్య, నయనతార పెర్ఫార్మెన్స్ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని, సినిమా అక్కడ మంచి ఫలితాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
బాలకృష్ణ ఇప్పటి వరకు అధికారికంగా ఏ సినిమాకు కమిట్ కాలేదు. అయితే అనధికారికంగా మాత్రం ఆయన త్వరలో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందబోయే 'ఆదిత్య 999' చిత్రానికి కమిట్ అయ్యారని తెలుస్తోంది. అదే విధంగా లక్ష్మి నరసింహ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపించిన బాలకృష్ణ చాలా కాలం గ్యాప్ తర్వాత అదే చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రంలో పోలీస్ గా అదరకొట్టనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.
మరో వైపు బాలయ్య సినీ వారసుడుగా ఆయన తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కొంత కాలంగా ఇదే విషయమై సీరియస్ గా కసరత్తు చేస్తున్నాడు. బాలయ్య 100వ సినిమా 'మోక్షజ్ఞ' తొలి సినిమాగా ప్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రంలో బాలయ్య అతిథి పాత్ర చేయడం ద్వారా తన కొడుకు హీరోగా రూపొందబోయే తొలి సినిమాపై అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












