శ్రీహరికి ముందే చెప్పా అలా జరుగుతుందని.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న వారిలో శ్రీహరి ఒకరు. ఒక సహా నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత విలన్ గానే కాకుండా హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. శ్రీహరి మరణించి ఏళ్ళు గడుస్తున్నా కూడా చాలా మంది తారలు ఆయనతో గడిపిన క్షణాలను మర్చిపోలేకపోతున్నారు. ఇటీవల బాలకృష్ణ కూడా శ్రీహరిపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

నర్తనశాల జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి

నర్తనశాల జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి

నందమూరి బాలకృష్ణ ఎన్నో ఏళ్ళ తరువాత నర్తనశాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. 17ఏళ్ల క్రితం ఆగిపోయిన ఆ సినిమా తాలూకు జ్ఞాపకాలు ఇంకా గుర్తుకు ఉన్నాయని బాలయ్య ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు. ముఖ్యంగా శ్రీహరి గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

భీముడి పాత్రకు శ్రీహరి.. ఎందుకంటే?

భీముడి పాత్రకు శ్రీహరి.. ఎందుకంటే?

నర్తనశాల సినిమాలో శ్రీహరి భీముడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర చేయడానికి ముఖ్య కారణం శ్రీహరికు ఉన్న టాలెంట్ అని తెలిపారు. కొందరికి టాలెంట్ ఉంటే ఫిజిక్ ఉండదు.. ఫిట్నెస్ ఉంటే టాలెంట్ ఉండదు. కానీ శ్రీహరికి మాత్రం మంచి టాలెంట్ తో పాటు ఫిజిక్ కూడా ఉంది. అందుకే ఆయనకు భీముడి పాత్రకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.

బాలయ్య ఎమోషనల్ కామెంట్స్

బాలయ్య ఎమోషనల్ కామెంట్స్

మొదట భీముడు పాత్ర అనగానే నాకు గుర్తుకు వచ్చింది శ్రీహరి మాత్రమే. ఫోన్ చేసి అడగగానే వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆయన మనసులో అనుకున్నదే బయటకు అనేస్తారు. నా లాగే.. నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారు. అందులో శ్రీహరి ఒకరు. చాలా మంచి మనిషి. ఎదుటి మనిషిని ఎంతగానో గౌరవిస్తారు. నాకు చాలా దగ్గరి ఆత్మ బంధువు అంటూ బాలకృష్ణ ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు.

నేను చెప్పిందే నిజమయ్యింది

నేను చెప్పిందే నిజమయ్యింది

అలాగే శ్రీహరి గురించి మరో విషయాన్ని ప్రస్తావిస్తూ.. శ్రీహరి మనసులో ఏది ఉంటే పైకి అదే మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో నేను ఈ స్థాయికి రావడానికి బాలకృష్ణ అనే చెప్పాడు. అది ఆయన మంచితనం. రాణా సినిమాలో కేశవ పాత్ర చేస్తే నీ కెరీర్ మారిపోతుందని చెప్పగానే ఆ తరువాత నిజంగానే ఆయన హీరోగా సక్సెస్ అయ్యారు.

శ్రీహరి అందరికి అలా చెప్పేవారు

శ్రీహరి అందరికి అలా చెప్పేవారు

అప్పటి నుంచి ఎవరైనా శ్రీహరి వద్దకు ఏదైనా మంచి అవకాశం కావాలని వస్తే.. మీరు వెళ్లి బాలకృష్ణ దృష్టిలో పడండి. ఆయన అవకాశం ఇస్తే మీ జీవితమే మారిపోతుంది. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కూడా ఆయనే అని శ్రీహరి అందరితో చెబుతూ ఉండేవారు. శ్రీహరి అలా మాతో ఉన్నారని వేరేవాళ్ళు కూడా నాతో చెప్పేవారు. ఎదుటిమనిషికి గౌరవాన్ని ఇవ్వడంలో శ్రీహరి మంచి మనసున్న వ్యక్తి.. అంటూ బాలకృష్ణ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X