ఆ పేరు వింటే రక్తం పొంగుతుంది.. ఎప్పుడుంటే అప్పుడు సై... బాలయ్య

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ అన్నారు. నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి రోజున టాలీవుడ్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ భావోద్వేగంగా ప్రసంగించారు. మహానటుడు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ..

తెలుగు వారి ఆత్మగౌరవం ప్రశ్నార్తకంగా

తెలుగు వారి ఆత్మగౌరవం ప్రశ్నార్తకంగా

ఎందరో తెలుగు మహనీయుల త్యాగాలు, కృషి నిర్వీర్యమై పోయి తెలుగు వారి ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు వారని కాకుండా మద్రాసీలుగా పిలువబడుతున్న సమయంలో నందమూరి తారక రామారావు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. తనకు ఎంతో గొప్ప జీవితాన్ని అందించిన ప్రజలకు ఏదైనా చేయాలనే బలమైన కోరికతో ముందుకు కదలాడు. ఆ తర్వాత ఆ నిర్ణయం చరిత్ర లిఖించేందుకు దారి తీసింది అని బాలకృష్ణ ఉద్వేగంగా అన్నారు.

 పాత్రలను ఆకళింపు చేసుకొని

పాత్రలను ఆకళింపు చేసుకొని

నటన అంటే కేవలం పాత్రలను పోషించడం కాకుండా.. వాటిని ఆకళింపు చేసుకొని ప్రతీ పాత్రలో జీవించేవారు. NTR అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు. ఎన్ అంటే ఆయన ఒక నటనాలయం. టీ అంటే తారా మండలంలో తారకుడు. ఆర్ అంటే రాజర్షి, రాజకీయ ధురంధుడు అంటూ బాలకృష్ణ నిర్వచనం చెప్పారు.

మూడు అక్షరాలు వింటే

మూడు అక్షరాలు వింటే

తెలుగు అనే మూడు పదాలను వింటే తనువు పులకిస్తుంది. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే రక్తం పొంగుతుంది అని బాలకృష్ణ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్టీఆర్‌ను అనుకరించే వాళ్లు వారసులు కాదు. అనుసరించే వాళ్లే నిజమైన వారసులు. కార్యకర్తలు, వారసులే నిజమైన వారసులు అని అన్నారు. ఎప్పుడు అవసరమైనా నేను ప్రత్యక్షం అవుతానని పేర్కొన్నారు.

దేశానికి గొప్ప పేరు తెచ్చిన ఎన్టీఆర్

దేశానికి గొప్ప పేరు తెచ్చిన ఎన్టీఆర్

పుట్టిన కుటుంబానికి, ఊరుకు, దేశానికి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వారికి ఆయనే నిజమైన మహానుభావుడు. ప్రపంచ పటంపై తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన నటుడు, రాజకీయ నేత ఆయన. ఎన్టీఆర్ నాకు తండ్రే కాదు.. దైవం. సమాజంలో ఎన్నో అసమానతలు రూపు మారిన వ్యక్తి జీవితం స్ఫూర్తిదాయకం. ఏప్పుడైనా మనసు బాగా లేకపోతే ఆయన పేరు తలుచుకొంటే శరీరంలో ఉత్తేజం కలుగుతుంది అని బాలకృష్ణ ఆన్‌లైన్‌లో ప్రసంగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X