వీడు నన్నే ఏడిపించాడు... : జై సింహ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య స్పీచ్

By Bojja Kumar

Recommended Video

'జై సింహ' ట్రైలర్.. బాలయ్య అదరగొట్టాడుగా !

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'జై సింహా' ప్రీ రిలీజ్ వేడుక సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ పండక్కి నవరసాలు ఉన్న చిత్రం మన 'జై సింహ'. నా సినిమాలు లార్జర్ దెన్ లైఫ్ లా ఉంటాయి అని బాలయ్య తెలిపారు.

‘జై సింహ’ చాలా స్పెషల్

‘జై సింహ’ చాలా స్పెషల్

దర్శకుడు కెఎస్ రవికుమార్ గారితో సినిమా చేద్దామని ఎనిమిదేళ్లుగా అనుకుంటున్నాను. ఈ టైటిల్‌తో ఆయనతో సినిమా కుదరడం మరింత ఆనందంగా ఉంది. ఇది మామూలు టైటిల్ కాదు. నాన్నగారు నిర్మాతగా విజయం అందుకున్న మొదటి చిత్రం టైటిల్ ఇదని బాలయ్య తెలిపారు.

నా సినిమాలు లార్జర్ దెన్ లైఫ్

నా సినిమాలు లార్జర్ దెన్ లైఫ్

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చిరంతన్ భట్ అంద్భుతమైన సంగీతం అందించారు. భాస్కర భట్ల, రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. కెమెరా మెన్ ప్రసాద్ పని తీరు సూపర్. రామ్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... అని బాలయ్య అన్నారు.

నేనెప్పుడూ కుర్రాడినే

నేనెప్పుడూ కుర్రాడినే

తానెప్పుడూ కుర్రాడినేనని.. వయసుతో పనిలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ వెల్లడించారు. ‘జై సింహా' చిత్రం కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని, ఈ సినిమా చాలా అద్బుతంగా వచ్చిందని, అందరూ హ్యాపీగా ఈ సినిమా చూడాలని అన్నారు.

వీడు నన్నే ఏడిపించాడు

వీడు నన్నే ఏడిపించాడు

సినిమాలో నాతో పాటు నటించిన ఈ చిన్నారి నన్నే ఏడిపించాడు. షూటింగులో ఈ చిన్నారికి నాతో కొన్ని సీన్లు ఉన్నాయి. లొకేషన్లో నన్ను చూస్తే ఏడ్చేవాడు. నరిసింహ నాయుడు నుండి కూడా నాకు ఇలానే అయ్యేది. ఫస్ట్ షాట్ పిల్లలతో పెడతారు. అపుడు నేను రక్తంతో ఉంటాను. ఏ పిల్లాడైనా అలా చూస్తే భయపడతారు. పిల్లలను ఎత్తుకుని గాల్లో ఎగురుతుంటే వారు భయపడతారు. అప్పటి దాకా బాగానే ఉంటారు. కానీ నన్ను చూడగానే ఏడుస్తారు. నేనేదో సినిమాలో విలన్ అయినట్లు.... నేను హీరో అనే విషయం పాపం వారికి తెలియదు కదా అంటూ బాలయ్య చమత్కరించారు.

ప్రేమను అందరికీ పంచండి

ప్రేమను అందరికీ పంచండి

ప్రేమను అందరికీ పంచిపెట్టాలనేది ఈ సినిమాలో కథకి మూలం. అందరూ కూడా కలిసి మెలిసి ఉండండి. హ్యాపీగా సినిమా చూడండి. చూసి ఏదైతే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశామో దాని ప్రతి పలం అందరూ అందుకోవాలని ఆశిస్తున్నాను.... అని బాలయ్య తెలిపారు.

బాలయ్య గురించి అలా చెప్పగానే భయమేసింది: కెఎస్ రవికుమార్

బాలయ్య గురించి అలా చెప్పగానే భయమేసింది: కెఎస్ రవికుమార్

‘నేను ఈ సినిమాకు కమిటైన కొత్తల్లో తమిళంలో చాలా మంది నన్ను అడిగారు. బాలయ్యతో ఎలా ఒప్పుకున్నారు, ఆయనకు చాలా కోపం ఉంటుంది అన్నారు. కొందరు అలా చెప్పగానే నాకు కూడా మొదట్లో కొంత భయం వేసింది. కానీ షూటింగులో నాకు ఆయనలో ఎప్పుడూ కోపం కనిపించలేదు. షూటింగ్ స్పాట్లో నాకే ఎక్కువ కోపం వస్తుంది. అలా చూస్తే బాలయ్య గారిలో అందులో 5 శాతం కూడా కోపం ఉన్నట్లు కనిపించలేదు'.... అని దర్శకుడు కెస్ రవికుమార్ తెలిపారు.

అక్కడ అజిత్, ఇక్కడ బాలయ్య

అక్కడ అజిత్, ఇక్కడ బాలయ్య

నేను ఇప్పటి వరకు 47 సినిమాలు చేశాను. ప్రతి హీరో సినిమా కథలో కల్పించుకుంటాడు. అది మార్చాలని, ఇది మార్చాలని, నాకు ఈ బాడీ లాంగ్వేజ్ రాదు అని, ఇది ఇలా మారిస్తే బావుటుంది అని చెప్పారు. కానీ నా కెరీర్లో కథలో వేలు పెట్టని హీరోలు ఇద్దరే. అది తమిళంలో అజిత్, తెలుగులో బాలయ్యగారు మాత్రమే అని కెఎస్ రవికుమార్ తెలిపారు.

బాలయ్య కోపం వస్తుంది

బాలయ్య కోపం వస్తుంది

బాలయ్యకు కోపం వస్తుంది. అది ఎప్పుడంటే ఆయన అసిస్టెంట్లు ఆయన్ను ఇరిటేట్ చేసినపుడు. వర్క్ బాగా చేస్తే ఆయన ఎలాంటి కోపం రాదు. ఇది నేను షూటింగ్ స్పాట్లలో గమనించాను అని కెఎస్ రవికుమార్ తెలిపారు.

తండ్రి మీద చాలా లవ్

తండ్రి మీద ఇంత ప్రేమ పెట్టుకున్న కొడుకును నేను బాలయ్యను తప్ప మరెవరినీ చూడలేదు. షాట్ ఫినిష్ అయిన తర్వాత ల్యాప్ టాప్ ముందు కూర్చుంటారు. అందులో ఎన్టీఆర్ ఫోటోనే ఉంటుంది. వింటే నాన్న గారి ఓల్డ్ సాంగ్స్ వింటారు. ఆయన భార్య, పిల్లల కంటే తండ్రినే ఎక్కువ ప్రేమిస్తారని నాకు అర్థమైంది.... అని కెఎస్ రవికుమార్ తెలిపారు.

అదే బాలయ్య సక్సెస్

బాలయ్యకు చాలా మంది అలవాట్లు ఉన్నాయి. సమాయానికి సెట్స్ కు వస్తారు, అందరితో చాలా నిజాయితీగా ఉంటారు. చాలా డెడికేటెడ్ గా పని చేస్తారు. ఆయన సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ కారణాలే. వాటి వల్లే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు... అని కెఎస్ రవికుమార్ తెలిపారు.

జాని మాస్టర్ స్పీచ్

ఈ చిత్రానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సందర్భంగా ఆయన బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రైటర్ రత్నం స్పీచ్

ఈ చిత్రానికి రత్నం డైలాగులు అందించారు.

బ్రహ్మానందం ఫన్నీ స్పీచ్

హాస్య నటుడు బ్రహ్మానందం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆయన బాలయ్యను ఓ వైపు పొగుడుతూనే నవ్వించారు.

వివి వినాయక్ స్పీచ్

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్ ను విష్ చేశారు.

దర్శకుడు బోయపాటి స్పీచ్

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు బోయపాటి శ్రీను ప్రసంగం ఆకట్టుకుంది.

నిర్మాత సి కళ్యాణ్ స్పీచ్

నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ స్పీచ్

ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందించారు.

హీరోయిన్ నటాషా స్పీచ్

ఈ చిత్రంలో నటాషా కూడా ఓ హీరోయిన్ గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X