ఒకే దెబ్బకు... బాలయ్య, మోక్షజ్ఞ సుడి తిరగాలి!
తాజాగా తన ఇంటికి కూడా వాస్తు మార్పులు చేయించుకునే పనిలో పడ్డారు బాలయ్య. త్వరలో తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తుండటం, తను కూడా రాజకీయ అరంగ్రేటం చేయనుండంతో ప్రముఖ వాస్తు పండితులను పిలిపించి తమ జాతకాలకు అనుకూలంగా ఇంటికి చిన్న చిన్న వాస్తు మార్పులు చేయిస్తున్నారట.
ఇలా చేయడం ద్వారా ఒకే దెబ్బకు ఇద్దరి సుడి తిరగడం ఖాయమని బాలయ్యను అభిమానించే వారు అంటున్నారు. బాలయ్య రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ దశ మారుతుందని, బాలయ్యకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పార్టీకి ప్లస్సవుతుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
కాగా... పరిశ్రమలోని ఇతర అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున లాంటి వారు తమ వారుసులను పరిశ్రమకు పరిచయం చేసి మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో.... తన వారసుడైన మోక్షజ్ఞను కూడా వారికి ధీటుగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే మోక్షజ్ఞకు నటన, డాన్స్ లాంటి విషయాల్లో ట్రైనింగ్ ఇప్పించే యోచనలో ఉన్నారు. సినీ రంగంపై పూర్తి అవగాహన కల్పించేందుకు విదేశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించే యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించే ఆలోచన కూడా చేస్తున్నారని వినికిడి.


Click it and Unblock the Notifications












