twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగులో అస్వస్థతకు గురైన బాలకృష్ణ

    By Bojja Kumar
    |

    విశాఖ: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లెజండ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం షూటింగులో ఉండగా బాలకృష్ణ అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

    వెంటనే బాలకృష్ణను విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి షూటింగులో పాల్గొన్నారు. బాలకృష్ణకు అలా ఎందుకు జరిగింది? ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు కాస్త కంగారు పడ్డారు.

    సినిమా వివరాల్లోకి వెళితే...వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.

    ఈ చిత్రం కోసం రూ. 20 లక్షల ఖర్చుతో హార్లే డేవిడ్‌సన్ బైకు ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. సినిమాలోని ఓ పాటలో బాలయ్య ఈ బైకుపై కనిపించనున్నారు. బాలయ్య స్వయంగా కోరడంతో పసుపురంగు బైకును కొనుగోలు చేసారట. ఆయన ప్రత్యేకంగా పసుపు రంగు ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి తెలుగు దేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలు పెట్టనున్న బాలయ్య తన రాజకీయ ప్రవేశానికి గుర్తుగానే ఈ పసుపు రంగు బైకును ఎంచుకున్నట్లు తెలుస్తోంది

    మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని టాక్.

    English summary
    A source from the production team of Legend, Balakrishna fall sick in shooting today. After Medical tests he continued shooting. irector Boyapati Srinu, who has earlier worked with Balakrishna in Simha, has written the script and is directing the actor again in the film Legend for the second time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X