twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లో కూర్చొని కాదు.. దమ్ముంటే ఇక్కడికి రా!: 'కత్తి'కి బాలయ్య ఫ్యాన్స్ సవాల్

    |

    కొత్త సినిమా ఏదైనా విడుదలైందంటే చాలు.. సినిమా హిట్టా?.. ఫట్టా?.. అన్న చర్చతో పాటు కత్తి రేటింగ్ ఎంత? అన్న ప్రశ్న ఇప్పుడు కామన్ అయిపోయింది. ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ రివ్యూపై అంతలా ఆసక్తి నెలకొని ఉంది. అదే సమయంలో ఆయా హీరోల అభిమానుల నుంచి కూడా ఆయనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా బాలకృష్ణ అభిమానులు మహేష్ కత్తికి ఓ సవాల్ విసిరారు..

    'జై సింహ' కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది (కత్తి మహేష్ రివ్యూ)'జై సింహ' కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది (కత్తి మహేష్ రివ్యూ)

    Recommended Video

    ‘జై సింహ' పై కత్తి మహేష్ ఏమన్నాడో తెలుసా ?
     కత్తికి సవాల్:

    కత్తికి సవాల్:

    కత్తికి ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా 'జై సింహా' ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు వచ్చి రివ్యూ చెప్పాలని బాలకృష్ణ అభిమానులు సవాల్ విసిరారు. 'జైసింహా' పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. కత్తి మాత్రం సినిమా బాగాలేదని చెప్పడమేంటి? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     కత్తి కామెంట్?:

    కత్తి కామెంట్?:

    బాలకృష్ణ ఓ అసంబద్ధమైన పాత్రలో నటించారని, కథ, కథనాలు చెప్పుకోదగ్గ రీతిలో ఏమి లేవని కత్తి జైసింహాపై కామెంట్ చేశారు. అంతేకాదు, జైసింహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.

     ఇంట్లో కూర్చొని కాదు..:

    ఇంట్లో కూర్చొని కాదు..:

    కత్తి కామెంట్ తో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలయ్య అభిమానులు ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. 'కత్తి ఇంట్లో కూర్చొని రివ్యూలు ఇవ్వడం కాదు.. దమ్ముంటే థియేటర్ వద్దకే వచ్చి చెప్పాలి' అని డిమాండ్ చేశారు.

     'సినిమా కత్తి కోసం కాదు':

    'సినిమా కత్తి కోసం కాదు':

    కత్తి రివ్యూను తప్పుపట్టిన బాలయ్య అభిమానులు.. సినిమా తీసింది ప్రేక్షకుల కోసం కానీ కత్తి కోసం కాదని ఎద్దేవా చేశారు. సినిమాకు అన్నిచోట్ల పాజిటివ్ టాక్ వచ్చిందని.. సంక్రాంతి విజేత బాలయ్య బాబే అని అభిమానులు చెబుతున్నారు.

     సంక్రాంతి విజేత?:

    సంక్రాంతి విజేత?:

    ఈ సారి సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఏ సినిమాకీ పూర్తిగా పాజిటివ్ టాక్ రాకపోవడం గమనార్హం. అటు అజ్ఞాతవాసి, గ్యాంగ్ చిత్రాలు డివైడ్ టాక్ మూటగట్టుకోగా.. బాలయ్య 'జైసింహా' వాటి కంటే కాస్త బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

     'రంగుల రాట్నం'కి మంచి ఛాన్స్:

    'రంగుల రాట్నం'కి మంచి ఛాన్స్:

    సంక్రాంతి బరిలో నిలిచి మంచి బజ్ క్రియేట్ అయిన సినిమాలన్నీ ఆశించిన మేర అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. ఇక మిగిలింది రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'రంగుల రాట్నం' మాత్రమే.

    మిగతా మూడు సినిమాలకు డివైట్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈ సినిమా గనుక పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశాలున్నాయి.

    English summary
    Film Critic Mahesh Kathi, who is known for his hard hitting reviews of Telugu films, has given negative review on Jai Simha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X