twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ఫాన్ సూసైడ్ ప్రయత్నం

    By Staff
    |

    Balakrishna
    బాలకృష్ణ ప్రమేయం లేకపోయినా ఆయన మరోసారి ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారారు. బాలయ్య వీరాభిమాని శనివారం ఆయన ఇంటి ముందు ఆత్మహత్య చేసుకొనేందుకు విఫలయత్నం చేయటంతో అందరూ దీనిపై తలో విధంగా స్పందస్తున్నారు. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్లో కాపాలదారుగా పనిచేసే రవికుమార్‌ (20) బాలకృష్ణ వీరాభిమాని. తన అభిమాన నటుణ్ని స్వయంగా కలిసి మాట్లాడాలని కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వస్తున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో బాలకృష్ణను కలిసే అవకాశం దక్కలేదు.

    దాంతో తన అభిమాన నటుడు బాలకృష్ణను కలిసి, మాట్లాడే అవకాశం దొరకనందుకు తీవ్ర మనస్తాపం చెందిన అతను శనివారం ఓ సీసా పెట్రోల్‌తో సహా బాలకృష్ణ ఇంటికి వచ్చాడు. ఒంటిపై పెట్రోలు పోసుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు సీసాను లాక్కొని పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని అక్కడనుంచి పోలీసులు తీసుకెళ్ళిపోయారు కానీ మీడియాలో న్యూస్ గా రావటంతో అంతా ఈ విషయంపై అంతటా చర్చగా మారింది.

    టైముకు వేరే వారు చూసి తప్పించారు కానీ ఆ అభిమాని తగలపెట్టుకుని ఉంటే పరిస్ధితి ఏమిటి అనేది కొందరు హీరోలు ఆలోచనలో పడుతున్నారు. తమకు కూడా ఇటువంటి పరిస్ధితి వస్తే ఏమిటన్నది వారు చర్చిస్తున్నారు. అభిమానం ముదిరి ప్రాణాలు తీసుకునేదాకా వస్తే కష్టమే కదా...వారే కాక,ఆ హీరోలకు సమస్యే కదా..అభిమానులు ఆలోచించాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X