బాలకృష్ణకు అభిమానుల తాకిడి!!
చిరంజీవి పార్టీ వార్త రాజకీయాలలోనే కాకుండా సినిమా పరిశ్రమలోనూ సంచలనం సృష్టిస్తోంది. చిరంజీవి పార్టీ వార్త వెలువడగానే బాలకృష్ణను రాజకీయాలలోకి దింపాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. చిరంజీవి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సభలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలు తీస్తున్నారు.
తామేం తక్కువ తినలేదన్నట్టుగా బాలకృష్ణ అభిమానులు కూడా బాలకృష్ణ రాజకీయాలలోకి రావాలని కోరుతూ శుక్రవారం ఆయన నివాసం ముందు హంగామా చేశారు. కడప, కర్నూలు, నిజామాబాద్, అనంతపురం జిల్లాల నుంచి ఆయన నివాసం వద్దకు చేరుకుని హడావుడి చేశారు. బాలకృష్ణ బయటకు వచ్చి అభిమానులకు నచ్చచెప్పి పంపించివేశారు.


Click it and Unblock the Notifications











