»   » ప్లెక్సీల గొడవ: బాలయ్య ఫ్యాన్స్ కూడా, పోలీస్ అలర్ట్

ప్లెక్సీల గొడవ: బాలయ్య ఫ్యాన్స్ కూడా, పోలీస్ అలర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భీమవరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల చించిన సంఘటనపై ప్రభాస్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లెక్సీలు చించింది ప్రభాస్ అభిమానులే అంటే పవన ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించారు. 144 సెక్షన్ విధించే వరకు పరిస్థితి వెళ్లింది. పోలీసులు కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా అరెస్టు చేసారు.

పవనప్ అభిమానులను అరెస్టు చేయడంతో వందలాది మంది ఫ్యాన్స్ బైక్ ర్యాలీతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఇలా అభిమానుల మధ్య గొడవలతో భీమవరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సామాన్య ప్రజలు హడలెత్తి పోతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే మరో చోట బాలయ్య అభిమానులు ఆందోలన చేస్తూ రోడ్డెక్కారు.

Balakrishna Fans created hullabaloo in Eluru

ఏలూరులో బాలయ్య ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. దీంతో బాలయ్య అభిమానులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే భీమవరం జరిగిన ఘటనతో అలర్ట్ గా ఉన్న పోలీసులు..... ఏలూరులో పరిస్థితి అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అదనపు బలగాలను ఏలూరు రప్పిస్తున్నట్లు సమాచారం.

ప్లెక్సీల విషయమై అభిమానుల మధ్య ఈ రేంజిలో గొడవలు జరుగుతున్నా...పోలీసులు అరెస్టులు చేస్తున్నా ఈ గొడవలను వారించేందుకు ఏ హీరో కూడా ప్రయత్నించడం లేదు. భీమవరంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్యే ప్రధానంగా గొడవ జరుగుతోంది. ఈ హీరోలు గొడవలు అదుపు చేసేందుకు, అభిమానులను శాంతింప చేసేందుకు ఏదైనా ప్రకటన చేస్తే బావుంటుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

English summary
Balakrishna Fans created hullabaloo in Eluru town of the district, claiming Balakrishna flexis were purposefully torn by unknown persons. The police intervened and made attempts to pacify the warring groups.
Please Wait while comments are loading...