HanuMan: హనుమాన్‌లో ఆ సీన్‌పై భారీ ట్రోల్స్.. డైరెక్టర్‌పై బాలయ్య ఫ్యాన్స్ అసంతృప్తి

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న సినిమానే 'హనుమాన్'. విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఆరంభం నుంచీ హైలైట్ అవుతూనే ఉంది. రియల్ సూపర్ హీరోగా చెప్పుకునే ఆంజనేయస్వామి కథతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఓ సీన్‌పై నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...

Recommended Video

HanuMan Director Prasahnth Varma పై Balakrishna ఫ్యాన్స్ అసంతృప్తి | Filmibeat

హనుమాన్‌గా తేజ ఎంటర్
ప్రశాంత్ వర్మ దర్శత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన సినిమానే 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.

Balakrishna Fans Disappoints on Palnati Brahmanayudu Scene in Hanu Man Movie

గ్రాండ్ రిలీజ్.. సందడిగా
క్రేజీ కాంబోలో తెరకెక్కిన 'హనుమాన్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లకు పైగానే విడుదల చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో ఈ సినిమా సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిలోనూ థియేటర్లు అన్నీ కళకళలాడుతున్నాయి.

హనుమాన్‌కు టాక్ అలా
సూపర్ హీరో స్టోరీతో రూపొందిన 'హనుమాన్' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి పాజిటివ్ టాక్ లభించింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఫలితంగా దీనికి భారీ వసూళ్లు వచ్చే చాన్స్ ఉంది.

Balakrishna Fans Disappoints on Palnati Brahmanayudu Scene in Hanu Man Movie

మూవీలో ఆ సీన్ హైలైట్‌
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తమ అభిమాన హీరో సినిమాను చూసిన వాళ్లంతా దానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అవి బాగా ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 'హనుమాన్'లోని కొన్ని క్లిప్స్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఇందులోని ట్రైన్ సీన్ తెగ వైరల్ అవుతోంది.

బాలయ్య చేసినట్లుగానే
తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' మూవీలో కొన్ని తెలుగు సినిమాల్లోని ఐకానిక్ అండ్ ఫన్నీ సీన్స్‌ను ప్రస్తావించాడు. ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ నటించిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' చిత్రంలోని ట్రైన్ సీన్‌ను కూడా ఇందులో పెట్టాడు. అయితే, అందులో బాలయ్య సైగ చేస్తే ట్రైన్ వెనక్కి వెళ్లగా.. ఇందులో మాత్రం అలా జరగనట్లుగా చూపించారు.

ట్రోల్స్.. ఫ్యాన్స్ నిరాశ
'హనుమాన్' సినిమాలో పల్నాటి బ్రహ్మనాయుడు సీన్‌ను రీ క్రియేట్ చేయడంతో ఇప్పుడు ఇది హైలైట్ అవుతోంది. దీన్ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తీరుపై అసంతృప్తిని వెల్లగక్కుతూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X