బాలయ్య అభిమానుల రచ్చ రంబోలా (ఫోటోలు)
హైదరాబాద్: లెజెండ్ సినిమా విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించి హైదరాబాద్‌లో రచ్చరంబోలా సృష్టించారు. బాలయ్య ఫోటోతో కూడిన లెజెండ్ జెండాలను ఎగుర వేస్తూ జై బాలయ్య జైజై బాలయ్య అంటూ సందడిచేసారు. లెజెండ్ సినిమాలో బాలయ్య గెటప్ మాదిరి జీన్స్, వైట్ షర్టు, మెడలో రుద్రాక్ష మాల, మెడపై టాటూలు వేసుకుని అభిమానులు సందడి చేసారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల గుండా సాగిన బాలయ్య అభిమానుల ర్యాలీ కూకట్ పల్లిలోని బ్రమరాంభ థియేటర్ వరకు సాగింది. థియేటర్ వద్ద అభిమానులు డాన్సులు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ సందడి చేసారు. ఈ సందర్బంగా అభిమానులు బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు.
బాలయ్య కేవలం సినిమా హీరో మాత్రమే కాదని, నిజ జీవితంలోనూ ఆయన హీరోనే అని వ్యాఖ్యానించారు. బాలయ్య చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా అభిమానులు ప్రస్తావించారు.
అభిమానుల బైక్ ర్యాలీకి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

బాలయ్య ఫ్యాన్స్
బాలయ్య ఫోటోతో కూడిన పసుపురంగు జెండాలతో సందడి చేస్తున్న అభిమానులు.

బాలయ్య లెజెండ్ గెటప్
బాలయ్య లెజెండ్ సినిమాలో మాదిరి జీన్స్, వైట్ షర్టు, రుద్రాక్ష మాల వేసుకుని హాజరైన అభిమానులు.

బైక్యా ర్యాలీ
బాలయ్య లెజెండ్ జెండాలు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న అభిమానులు.

ఫ్యాన్స్ సందడి
కూకట్ పల్లి జగదాంబ థియేటర్ వద్ద అభిమానుల సందడి.

లెజెండ్ టాటూలు
బాలయ్య లెజెండ్ చిత్రంలో మెడపై టాటూతో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి టాటూలనే అభిమానులు వేసుకున్నారు.

మెడపై టాటూ వేసుకుంటున్న ఫ్యాన్స్
బాలయ్య మాదిరి మెడపై ఓం గుర్తుతో కూడిన టాటూను వేయించుకుంటున్న అభిమానులు.

బైక్ ర్యాలీతో సందడి
బాలయ్యకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న నందమూరి అభిమానులు.


Click it and Unblock the Notifications











