థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ వీరంగం, స్క్రీన్ చించివేత!
అనంతపూర్: అభిమానులకు కోపం వస్తే ఎలా ఉంటుందో...వారి తడాఖా ఏ రేంజిలో ఉంటుందో మరోసారి రుజువైంది. నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లో అభిమానులు వీరంగం సృష్టించారు. కుర్చీలు విరగొట్టారు. స్క్రీన్ చించివేసారు. అనంతపూర్‌లోని గురునాథ్ థియేటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
సినిమా ప్రదర్శితం అవుతున్న సమయంలో సౌండ్ సిస్టం సరిగా పని చేయలేదు. దీంతో అభిమానులు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవ్వడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు థియేటర్లోని కుర్చీలు, స్క్రీన్‌పై తన ప్రతాపం చూపించారు. ఈ ఘటనపై మేనేజ్మెంట్ లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

లెజెండ్ సినిమా విషయానికొస్తే...మార్చిన 28న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతోంది. 'సింహా' లాంటి హిట్ చిత్రం తర్వాత బాలయ్యపై భారీగా అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగిన విధంగానే బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. తొలి రోజు ఈ చిత్రం రూ. 7 కోట్లకు పైగా వసూలే చేసింది. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించబోయే చిత్రంగా నిలవబోతోందని, 50 కోట్ల మార్కను త్వరలోనే అందుకుంటుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విజయోత్సవ యాత్ర నిర్వహిస్తూ బిజీబిజీగా గుడుపుతున్నారు. ఈ రోజు సింహాచలం గుడి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ మీదుగా విజయోత్సవ యాత్ర సాగింది. ఏప్రిల్ 2న ఉదయం 5.30 గంటలకు కనకదుర్గ గుడి, 7 గంటలకు మంగళగిరి గుడి, 8 గంటలకు పెద కాకాని గుడి, 11.30 గంటలకు ఒంగోలు థియోటర్, మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు థియోటర్, రాత్రి 7 గంటలకు తిరుపతి థియోటర్లను లెజెండ్ టీం సందర్శించనుంది.


Click it and Unblock the Notifications











