బాలయ్య ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. 'అ' విషయం తెలిసి కూడా అఖండ టైటిల్ ఎలా పెట్టారంటూ!
ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందరితో పోలిస్తే సీమ వాళ్లకు ఈ సెంటిమెంట్లు కాస్త ఎక్కువే. టైటిల్స్ మొదలు కాంబినేషన్ దాకా, దాదాపు అన్ని విషయాలలో సెంటిమెంట్ చూసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలు టైటిల్ సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. హీరో గోపీచంద్ రెండు అక్షరాల టైటిల్ తో సినిమా చేయాలని భావిస్తాడు.
దర్శకుడు సుకుమార్ సైతం రెండక్షరాల టైటిల్స్ ఉండేవా చూసుకుంటానని ప్రయత్నిస్తూ ఉంటాడు. వీరిద్దరూ ఉదాహరణ మాత్రమే దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు దర్శకులు తమ తమ సినిమాల విషయంలో ఇలాంటి సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు.

భయపెడుతున్న 'అ' సెంటిమెంట్
ఇప్పుడు అదే సెంటిమెంట్ బాలయ్య అభిమానులను భయపెడుతోంది. నిజానికి బాలకృష్ణ హిట్ అందుకునే నాలుగేళ్లు అవుతోంది. 2017లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చివరిసారిగా హిట్ కొట్టాడు బాలయ్య. ఆ తర్వాత బాలకృష్ణ పైసా వసూల్, జై సింహ తన తండ్రి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు బయోపిక్ సిరీస్, చివరిగా రూలర్ అనే సినిమాలు చేసి రిలీజ్ చేశారు. కానీ అనూహ్యంగా వీటిలో ఒక్క హిట్ కూడా దక్కలేదు. దీంతో బాలకృష్ణ తన కెరీర్ లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు..

హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తుంటే
బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో మొదటి సినిమాగా సింహా వచ్చింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో లెజెండ్ సినిమా వచ్చింది.. రాధిక ఆప్టే సోనాల్ చౌహాన్ హీరోయిన్ స్ గా నటించిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. అయితే అయితే ఈ మూడో సినిమా అయిన అఖండ కూడా హ్యాట్రిక్ కొడుతుందని బాలయ్య అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని ప్రమోషనల్ వీడియోలు, ఫస్ట్ లుక్ లు సినిమా మీద మరింత నమ్మకాన్ని పెంచాయి. అయితే టైటిల్ రివీల్ చేశాక బాలకృష్ణ అభిమానులలో కొత్త టెన్షన్ నెలకొంది.

ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా
విషయం ఏమిటంటే బాలకృష్ణకు ఆ అక్షరంతో ప్రారంభమయ్యే టైటిల్స్ అంతగా అచ్చిరావు అని అంటున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అనసూయమ్మగారి అల్లుడు అనే సినిమా మినహా మరే సినిమాలోనూ ఆయనకు విజయం దక్కలేదు అని అభిమానులు చెబుతున్నారు.. దాదాపు ఆయన ఆ అనే పేరుతో చేసిన సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేదని అలాంటి సెంటిమెంట్ ఉన్నా సరే ఇప్పుడు అఖండ అనే టైటిల్ పెట్టడం వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అని ఆలోచన చేస్తున్నారు.
Recommended Video

ఒక్కటే హిట్, అయినా ఎందుకు రిస్క్
బాలకృష్ణ హీరోగా పరిచయం కాకముందు, తన తండ్రి నటరత్న ఎన్టీఆర్ తో కలిసి "అన్నదమ్ముల అనుబంధం, అక్బర్ సలీం అనార్కలి, అనురాగ దేవత" లాంటి చిత్రాలలో నటించారు. అన్నీ మ్యూజికల్ హిట్స్, కానీ ఒక్క సినిమా కూడా కమర్షియల్ హిట్ కాదు. బాలయ్య హీరో అయిన తర్వాత 'అ' అక్షరంతో మొదలైన 'అనసూయమ్మగారి అల్లుడు లో నటించారు. ఈ ఒక్క సినిమా మాత్రం హిట్ అయింది. కానీ అపూర్వ సహోదరులు, అల్లరి కృష్ణయ్య, అశోక చక్రవర్తి, అశ్వమేధం, అల్లరి పిడుగు, అధినాయకుడు లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ అన్ని సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి. దీంతో బాలయ్య అభిమానులలో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.


Click it and Unblock the Notifications











