Balakrishna అభిమానులకు ఫుల్ మీల్స్ రెడీ.. సింహం వేటకు సిద్ధమైంది!

అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన అఖండ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాక బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో ఒక థియేటర్ లో ఆడుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా ఇచ్చిన అద్భుతమైన బూస్ట్ తో నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అయితే ఇంకా ప్రకటించలేదు కానీ నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కావడంతో అదే పేరుతో సంభోదిస్తున్నారు.

టైటిల్ మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ సినిమా మాత్రం ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా అని చెబుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తారని మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

Balakrishna fans to get a treat with an exciting update on his birthday from nbk 107.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో చంద్రిక రవి అనే ఒక ఆస్ట్రేలియా ఇండియన్ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ మధ్యనే ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్గా చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ అద్భుతంగా వచ్చిందని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి అద్భుతంగా నచ్చుతుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే జూన్ పదో తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోబోతున్నా సందర్భంగా ఆ రోజున ఫస్ట్ హంట్ విడుదల చేస్తామని చెబుతూ సినిమా యూనిట్ ఇప్పుడు ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఫస్ట్ హంట్ లోడింగ్, సింహం వేటకు సిద్ధమైంది అంటూ క్యాప్షన్ జోడించింది. ఇక ఈ దెబ్బతో నందమూరి అభిమానులలో ఫుల్ జోష్ నెలకొంది. బాలయ్య బర్త్ డే రోజున ఒక మంచి మాస్ అప్డేట్ రావొచ్చని అంచనాలు వెలువడుతూ ఉండటంతో వారంతా గాల్లో తేలిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X