NTR తో 80 సినిమాల్లో నటించిన హీరోయిన్‌కు ఘన సన్మానం.. బాలకృష్ణ ఎమోషనల్ స్పీచ్

భారతీయ సినిమా పరిశ్రమలో లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీనియర్ నటి ఎల్ విజయలక్ష్మీ సోమ‌వారం నాడు హైద‌రాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా సన్మానించింది. తెలుగు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన ఆమెను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి అభినంద‌న‌లు తెలపాల‌ని బాల‌కృష్ణ భావించారు. అందులో భాగంగా సినీ ప్ర‌ముఖులు స‌మ‌క్షంలో నంద‌మూరి బాల‌కృష్ణ FNCC లో ఆమెకు గౌర‌వ స‌త్కారం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..

ఎల్ విజయలక్ష్మీ గారికి శిరస్సు వంచి

ఎల్ విజయలక్ష్మీ గారికి శిరస్సు వంచి


శత పురుషుడి.. శతాబ్ది పురస్కారం గ్రహీత శ్రీమతి ఎల్ విజయలక్ష్మీ గారికి శిరస్సు వంచి వందనాలు. ఈ వేడుకకు హాజరైన సినీ ప్రముఖులకు, అలాగే విజయలక్ష్మీతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు సురేష్ బాబు, బాపిరాజు, చిన్నబాబుకు, పరుచూరి గోపాలకృష్ణ, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరుపాలని కొమ్మినేని వెంకటేశ్వరరావు, ఆలపాటి రాజా, బుర్ర సాయిమాధవ్ తదితరులు కమిటీ ఏర్పాటు చేసి.. నన్ను గౌరవ అధ్యక్షుడిగా నియమించి.. కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించారు అని బాలకృష్ణ అన్నారు.

అమెరికాలో స్థిరపడిన సీనియర్ నటి

అమెరికాలో స్థిరపడిన సీనియర్ నటి

దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సినీ, రాజకీయ నేతలను సత్కరించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉంటున్న సీనియర్ నటి ఎల్ విజయలక్ష్మీని ఆహ్వానించి సన్మానించారు. నాన్న గారిపై ఉన్న గౌరవంతో అమెరికా నుంచి వచ్చిన విజయలక్ష్మీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని బాలకృష్ణ చెప్పారు.

వైజయంతి మాల స్పూర్తితో

వైజయంతి మాల స్పూర్తితో

ఎల్ విజయలక్ష్మీ గారు ఎర్నాకులంలో పుట్టి పెరిగి.. అక్కడే సంప్రదాయ నృత్యాన్ని అభ్యసించారు. వైజయంతి మాల స్పూర్తితో నటిగా మారారు. 59 నుంచి 1969 వరకు 100కుపైగా సినిమాల్లో నటించారు. సుమారు 80కిపైగా నాన్నగారితో సినిమాలు చేసి ఉంటారు. నాట్యం, నటనపట్ల ఆమెకు ఉన్న అంకితభావంతో తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. కళామతల్లికి విశేష సేవలు అందించారు అని బాలకృష్ణ ప్రశంసలు గుప్పించారు.

వర్జినీయా యూనివర్సిటీలో

వర్జినీయా యూనివర్సిటీలో

నటనలో కొంత కాలం రాణించిన తర్వాత.. నాన్నగారి నుంచి స్పూర్తి పొంది... ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాకు వెళ్లిన తర్వాత మెట్రిక్యులేషన్, సీఎ లాంటి ఉన్నత విద్యను అభ్యసించారు. వర్జినీయా యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అలాగే జుంబా డ్యాన్స్‌ను కూడా నేర్చుకొంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె మహిళా సాధికారితకు ఆమె ఓ ప్రతీక. భావితరాలకు ఎల్ విజయలక్ష్మీ ఆదర్శంగా నిలిచారు అని బాలకృష్ణ అన్నారు.

వైవీఎస్ చౌదరికి ప్రత్యేకంగా అభినందనలు

వైవీఎస్ చౌదరికి ప్రత్యేకంగా అభినందనలు


ఎల్ విజయలక్ష్మీ గారిని హైదరాబాద్‌కు రప్పించడంలో విశేష కృషి చేసిన దర్శకుడు వైవీఎస్ చౌదరికి ప్రత్యేకంగా అభినందనలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రతీ ఒక్కరికి నా అభినందనలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సావాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం అని బాలకృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X