Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణకు అవమానం!
డెక్కన్ చార్జర్స్ విజయాన్ని పురస్కరించుకుని నిన్న హైదరాబాద్ లో బ్రహ్మాండమైన పార్టీ జరిగింది. దీనికి వివిధ రంగాలకు చెందిన 400 మంది ప్రముఖులు హాజరయ్యారు. హీరో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గర్వంగా ఒక చోట కూర్చుని ఉండకుండా అందరితో కలిసిపోడానికి ఆయన ప్రయత్నించారు. హై సొసైటీ పేజ్ త్రీ యువతి ఒకరు "మిమ్మల్ని గతంలో చూడలేదు, ఈ సిటీకి కొత్తా" అని అడిగింది. దానితో బాలకృష్ణకు కొంత సేపు మాటలు నట్లు పడ్డాయి. "నా పేరు బాలకృష్ణ. టాలీవుడ్ యాక్టర్ ని.ఎన్టీఆర్ కుమారుడిని" అని ఇంగ్లీషులో చెప్పుకోవలసి వచ్చింది. హిందీ, ఇంగ్లీషు సినిమాలు మాత్రమే చూసే వారికి తాను తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదనుకుని సరిపెట్టుకున్న బాలయ్య మరో యువతి వద్దకు వెళ్ళారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆమె రేఖాజైన్. "మీరు నాకు తెలుసు" అని ఆమె హిందీలో చెప్పింది. డ్యాన్స్ చేసుకుందామా అని బాలయ్య ఆహ్వానించగా "నేను నా భర్తతో మాత్రమే డ్యాన్స్ చేస్తాను" అని చెప్పింది. రాంగ్ నెంబర్ కు కాల చేశాననుకుంటూ బాలకృష్ణ మళ్ళీ బార్ రూమ్ కు బయలుదేరారట.