twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ రియల్ లైఫ్ లో జరిగినవే సినిమాలో...

    By Srikanya
    |

    బాలకృష్ణగారితో సినిమా తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన రియల్ లైఫ్ జరిగిన జరిగిన విషయాలను ఈ సినిమాలో వాడుతున్నాను అని దర్శకుడు రవి చావలి చెప్పారు. అలాగే ఆయన ఇమేజ్ కు స్టార్ డమ్ కు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. స్టైలిష్ గానూ,పవర్ ఫుల్ గానూ బాలయ్య ఈచిత్రంలో కనిపిస్తారు అన్నారు. బాలకృష్ణ,రవిచావలి కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త చిత్రం ఈ రోజు(సోమవారం) ముహూర్తం జరిగింది. ఈ సందర్భంగా దర్సకుడు ఇలా స్పందించారు.

    ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ప్లవర్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రారంభం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. బాలకృష్ణ సరసన పార్వతీ మిల్టన్, ఇషాచావ్లా నటిస్తున్నారు.రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవిచావలి దర్శకుడు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...దర్సకుడు రవి ఈ కథ చెప్పగానే ఆకట్టుకుంది. సంభాషణలుకూడా ఘటికాచలం గారు అధ్బుతంగా ఇచ్చారు. నా సినిమాలో ఏమేమి ఉంటాయో..అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి అన్నారు. సంగీత దర్శకుడు చక్రి ..సింహా తర్వాత మరో సారి బాలకృష్ణ సినిమాకు పనిచేస్తున్నందుకు...తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

    English summary
    Balakrishna and director Ravi Kumar Chavali's film was launched on Monday afternoon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X