బాలకృష్ణ చిత్రం సంక్రాంతికి రావటం లేదు
జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం నిన్నటి నుంచి నానక్ రామ్ గూడ హైదరాబాద్ లో ఎమోషనల్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. 'సింహా' తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. రాథికా ఆప్టే హీరోయిన్ గా ఎంపికైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.... ''యాక్షన్ తరహాలో సాగే బాలకృష్ణ మార్కు సినిమా ఇది. ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తీర్చిదిద్దుతున్నారని'' అన్నారు. బాలకృష్ణ, జగపతిబాబుపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు. అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు.


Click it and Unblock the Notifications












