twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ లొకేషన్ లోనే బాలకృష్ణ

    By Srikanya
    |

    బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న 'అధినాయకుడు" సినిమా షూటింగు గత రెండు రోజుల నుంచి కర్నూలులో జరుగుతోంది. పట్టణంలోని ప్రసిద్ధ కొండారెడ్డి బురుజు దగ్గర ప్రస్తుతం షూటింగ్‌ చేస్తున్నారు. గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్‌ గెటప్‌ లో కనిపించిన బాలయ్య అధినా యకుడులో మరోసారి ఆ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు గెటప్‌లలో వృద్ధుడి గెటప్‌లో వున్న బాలకృష్ణ పాల్గొనే ఎమోషనల్‌ సన్నివేశా లను షూట్‌ చేస్తున్నారు. బాలకృష్ణను చూడడానికి జనం విపరీతంగా వస్తున్నారు. చిత్రంలో ఇవి కీలక సన్నివేశాలని తెలుస్తోంది. గతంలో మహేష్‌బాబు నటించిన 'ఒక్కడు సినిమా కోసం ఇదే లొకేషన్లో షూటింగ్‌ చేశారు.'అధినాయకుడు" చిత్రాన్ని కీర్తి కంబైన్స్‌ పతాకంపై ఎమ్మెల్‌ కుమార్‌ చౌదరి నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్‌, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్‌ కంపోజ్‌ చేసిన అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చా యని అంటున్నారు. నవంబర్‌లో ఈ చిత్రం ఆడియో విడుదల కాబోతుందని వినికిడి. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మూవీగా 'అధినాయకుడు" రాబోతోంది.

    దర్శకుడు పరుచూరి మురళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... “ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. ఈ సినిమాని కీర్తి కంబైన్స్ పతాకం పై ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు . ఈ అధినాయకుడు శ్రీరామరాజ్యం విడుదల అయిన రెండు నెలల గ్యాప్ లోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది. కర్నూలు లో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అంటే శ్రీరామరాజ్యం రిలీజ్ కాకముందే అధినాయకుడు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు ముస్తాబు అవుతుంది. బాలకృష్ణ్ణ లేటెస్ట్‌ మూవీ శ్రీరామరాజ్యం నవంబర్‌ 10న రిలీజ్‌ అవుతుండగా.. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎంఎల్‌ కుమార్‌ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయుడు" షూటింగ్‌ జరుపుకుంటోంది.

    English summary
    Balakrishna, Parachuri Murali upcoming film tentatively titled as Adhinayakudu wrapped up a schedule in Kurnool.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X