అరకులో మొదలెట్టబోతున్న బాలకృష్ణ, త్రిష
హైదరాబాద్: బాలయ్య, త్రిష జంటగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలాఖరు నుండి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరకు లోయలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఎస్‌ఎల్‌వి సినిమా బ్యానర్లో రుద్రపాటి రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా, అంజలి మరో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, అలీ, చంద్రమోహన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

బాలయ్య ఇటీవల నటించిన 'లెజెండ్' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక పోతే బాలయ్య త్వరలో చేయబోయే 100వ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ సినిమా ఎవరితో చేస్తున్న విషయం బాలయ్య చెప్పక పోయినప్పటికీ.....రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఉంటుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణ దేవరాయల సబ్జెక్టుతో ఈ చిత్రం ఉండే అవకాశం ఉంది. బాలయ్య కెరీర్లోనే హైలెట్ అయ్యేలా ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











