For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమరావతిలో 500 ఎకరాలు... బాలయ్య స్టూడియో కట్టబోతున్నారా?

|

ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ఓ ఆంగ్లపత్రికలో పబ్లిష్ అయిన కథనం సంచలనంగా మారింది. ఏపీ కొత్త రాజధాని అమరావతిలో బాలయ్య, బంధువులు కలిసి 500 ఎకరాలు భూమి కొనుగోలు చేశారట. ఆలస్యంగా వెలుగులు చూసిన ఈ విషయం ఏపీ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించడానికి ముందే ఈ కొనుగోలు లావాదేవీలు జరినట్లుగా ఆ కథనంలో పేర్కొన్నారు. బాలయ్యతో పాటు తెలుగు దేశం పార్టీకి చెందిన చాలా మంది నాయకులు ముందే ఈ కొనుగోళ్లు జరిపినట్లు సమాచారం.

బాలయ్య స్టూడియో కట్టబోతున్నారా?

బాలయ్య స్టూడియో కట్టబోతున్నారా?

ఇంత భారీ మొత్తంంలో బాలయ్య, బంధువులు భూమి కొనుగోలు చేయడం ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశం అయింది. భవిష్యత్తులో ఈ నందమూరి హీరో ఇక్కడ సినిమా స్టూడియో కట్టే అవకాశం ఉందని అంటున్నారు.

బాలయ్య ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటో?

బాలయ్య ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటో?

ఎన్‌బికె ఫిల్మ్స్ పేరుతో బాలయ్య ఇటీవల సినీ నిర్మాణ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞను కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. అమరావతిలో తమకంటూ సొంతగా ఓ స్టూడియో ఉంటే బావుంటుందని బాలయ్య ప్లాన్ చేస్తున్నారట.

భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ అమరావతిలో కూడా...

భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ అమరావతిలో కూడా...

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోంది. భవిష్యత్తులో అమరావతి, వైజాగ్‌ లాంటి ప్రాంతాలకు సినీ ఇండస్ట్రీ విస్తరించే అవకాశం ఉందని టాక్. ఆ ముందు చూపుతోనే బాలయ్య ఈ భూమి కొనుగోలు చేసినట్లుగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

రాజకీయ దుమారం

రాజకీయ దుమారం

కాగా... బాలయ్య, బంధువులు 500 ఎకరాల భూమి కొనుగోలు చేసిన అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ గొడవల సంగతి ఎలా ఉన్నా.... ఏపీ ప్రజలు, సినీ అభిమానులు తమ రాష్ట్రానికి ఇండస్ట్రీ రావాలని బలంగా కోరుకుంటున్నారనేది వాస్తవం.

English summary
Balakrishna and his relatives bought 500 acres of land in Amravati, the new capital of Andhra Pradesh, a leading English Daily published the sensational article.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more