Taraka Ratna: గుండె పగిలేలా ఏడ్చిన బాలయ్య.. అంత్యక్రియలపై కీలక నిర్ణయం.. ఆఖరికి ఆ చిన్నారి కూడా!
ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. ఇది గుండెపోటు అని గుర్తించిన వైద్యులు చికిత్సను అందించారు. అలా 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఇక, కుమారుడి భౌతికకాయాన్ని చూసి బాలయ్య తల్లడిల్లిపోయారు. అలాగే, తారకరత్న అంత్యక్రియలపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...

స్వగృహంలోనే భౌతికకాయం
గుండెపోటుకు గురైన తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజుల పాటు చికిత్స తీసుకున్న నందమూరి తారకరత్న శనివారం సాయంత్రం తుది శ్వాసను విడిచారు. ఆ వెంటనే ఆయన భౌతికకాయాన్ని అక్కడి నుంచి హైదరాబాద్ శంకర్‌పల్లిలోని నివాసానికి తీసుకు వచ్చారు. ఇప్పటికే అక్కడికి ఎంతో మంది ప్రముఖులు చేరుకున్నారు.

తారకరత్నకు సంతాపం చెప్తూ
నందమూరి తారకరత్న మరణంతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటూ పోస్టులను పెడుతున్నారు.

తారకరత్న కోసం బాలయ్య
నందమూరి తారకరత్నకు నటసింహా బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయనకు కూడా అన్న కొడుకుపై చాలా ప్రేమ ఉండేది. అందుకే తారకరత్న గుండెపోటుకు గురైన సమయం నుంచి బాలయ్య ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అంతేకాదు, కొడుకును కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, తారకరత్నను మాత్రం కాపాడుకోలేకపోయారు.

భౌతికకాయం చూసి ఏడుపు
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ శంకర్‌పల్లిలోని ఆయన నివాసానికి తీసుకు వచ్చినా.. బాలకృష్ణ మాత్రం చాలా సేపు అక్కడకు చేరుకోలేదు. కొద్ది సేపటి క్రితమే తన అన్న కుమారుడి చివరి చూపు కోసం ఆయన వచ్చారు. నిర్జీవంగా ఉన్న తారకరత్నను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ సమయంలో ఆయనను ఓదార్చడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు.

తారకరత్న కూతురు కూడా
తారకరత్న మరణ వార్త తెలిసినప్పటి నుంచి ఆయన పెద్ద కుమార్తె నిష్క శోక సంద్రంలో మునిగిపోయింది. తన తండ్రి భౌతికకాయాన్ని చూసి తల్లడిల్లిపోతోంది. ఇలాంటి సమయంలోనే బాలయ్య అక్కడకు చేరుకోవడంతో తాతను గట్టిగా హత్తుకుని బాధనంతా వెల్లగక్కేసింది. ఆ సమయంలో బాలయ్య కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం ఆ చిన్నారికి ధైర్యం చెప్పారు.

బాలయ్య చెప్పిన టైమ్‌కే
తారకరత్న అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు ముందే చెప్పారు. ఈ విషయంలో బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 8.45 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలిస్తారు. ఆ తర్వాత మహాప్రస్థానానికి తీసుకెళ్లి సరిగ్గా మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు జరిపేలా ఆయన నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











