బాలకృష్ణకు రూ. 10వేల జరిమానా

అయితే బాలకృష్ణ ఎలాంటి నిబంధనలు పాటించలేదు. ఆయన బోరు వేసిన విషయమై స్థానికులు కొందరు అధికారులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు ఆయన ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేల్చారు. దీంతో బాలయ్యకు జరిమానా విధించారు.
ఆ సంగతి పక్కన పెడితే....బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'లెజెండ్' చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈచిత్రం విడుదలైన అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతోంది. బాలయ్య యాక్షన్, డైలాగ్స్ అదరిపోయే విధంగా ఉన్నాయని అభిమానులు అంటున్నారు.
గతంలో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో 'సింహా' చిత్రం విజయవంతం అయింది. దీంతో 'లెజెండ్' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా 'లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కిచాయి. సినిమా విజయవంతం కావడంతో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











