»   » జూ ఎన్టీఆర్ ఇష్యూ: మీడియాపై బాలయ్య ఆగ్రహం

జూ ఎన్టీఆర్ ఇష్యూ: మీడియాపై బాలయ్య ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నిన్న(ఏప్రిల్ 19) సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వైజాగ్ వచ్చిన సందర్భంగా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు, జూ ఎన్టీఆర్ కు మధ్య విబేధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆయన మండి పడ్డట్లు తెలుస్తోంది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పిన బాలయ్య మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మండి పడ్డారు.

ఇటీవల లయన్ ఆడియో వేడుకలో...బాలయ్య చెప్పిన డైలాగ్ ఒకటి నందమూరి అభిమానుల సర్కిల్ లో చర్చనీయాంశం అయింది. ‘బాలయ్యతో పెట్టుకుంటే ఎవరైనా అంతే.. చిట్టెలుకలూ, చిరుత పులులూ మనతో పెట్టుకుంటే మాడి మసైపోతాయి' అంటూ బాలయ్య అభిమాను సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు జూ ఎన్టీఆర్ గురించే అంటూ ప్రచారం జరిగింది.


బాలయ్య ‘లయన్' సినిమా విశేషాల్లోకి వెళితే...ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.


Balakrishna fired the media

బాలయ్య నటించిన గత చిత్రం ‘లెజెండ్' భారీ హిట్టయిన నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పబ్లిసిటీ జోరు పెంచారు. సినిమాకు సంబంధించిన సరికొత్త స్టిల్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.


ఇటీవల శిల్పకళా వేదికలో జరిగిన ‘లయన్' ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో పంక్షన్ గ్రాండ్ గా జరిగింది. నిర్మాత రమణారావు మాట్లాడుతూ...ఈ చిత్రంలో బాలయ్య గారి పాత్రను దర్శకుడు సత్యదేవ మలిచిన తీరు, ఆయన చేత పలికించిన సంబాషణలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. బాలకృష్ణ-మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న మరో మ్యూజికల్ సెన్నేషన్ హిట్ ఈ సినిమా' అన్నారు.

English summary
Nandamuri Balakrishna has fired the media yesterday, the April 19th. He fired the media saying “Who said there is clash between Jr NTR and me? We are okay and share good relationship between us, there is no need of saying answers to all your questions”.
Please Wait while comments are loading...