'నాలో రెండో మనిషి ఉన్నాడు వాడ్ని నిద్రలేపకు..నువ్వు శాశ్వతంగా నిద్రపోతావ్’: బాలయ్య
సరైన సబ్జెక్ట్ దొరికిన ప్రతిసారీ 'సింహా"న్నై గర్జిస్తానని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే వున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పరుచూరి మురళి దర్శకత్వంలో చేయనున్న తన తదుపరి చిత్రానికి అద్భుతమైన కథ కుదిరిందంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యబాబుతో పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మించనున్న సదరు భారీ చిత్రంలో 'నాలో రెండో మనిషి ఉన్నాడు వాడ్ని నిద్రలేపకు..నువ్వు శాశ్వతంగా నిద్రపోతావ్" అంటూ నందమూరి బాలకృష్ణ డైలాగ్ చెప్పగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టారు.
రామానాయుడు స్టూడియోలో జరిగిన బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభోత్స వేడుకలో బాలయ్య చెప్పిన తొలి డైలాగ్ ఇది. ఈ సందర్భంగా అక్కడ ఏర్సాటు చేసిన ఈ చిత్ర వినైల్స్, ఆ డిజైన్స్ లోని బాలయ్య స్టిల్స్ వీక్షకలను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వున్నాయి. 'ఆంధ్రుడు" తో మంచి కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్న పరుచూరి మురళికి ఇప్పుడు భాలయ్య రూపంలో తిరుగులేని మాస్ హీరో దొరికాడు కనుక డెఫినెట్ గా ఓ సెన్సేషనల్ ఫిల్మ్ వస్తుందని, దర్శకుడిగా 'ఆంద్రుడు" మురళి సత్తా ఏమిటో బాలయ్యసినిమా చూపుతుందని ఆశించొచ్చు.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి రాఘవేంద్ర రావు, సురేష్ బాబు వంటి అనేక మంది సినీ పెద్దలు హాజరయ్యారు. శ్రీకీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎంఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా పరుచూరి మురళీ దర్శకుడు. సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











