నరసింహా అవుతాను...సింహా అవుతాను... బోబ్బిలిపులి అవుతాను
బాలయ్య.....బాలయ్య.....బాలయ్య ఇప్పుడు తెలుగు ఇండస్ర్టీలో వినిపిస్తున్న పేరు. 'సింహా' హిట్ తరువాత ఆయన నటిస్తున్న చిత్రం 'పరమవీరచక్ర' కావడం, బాలయ్య 50వ పుట్టిన రోజు సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో అందరు ఈసినిమా షూటింగ్ గురించి మాట్లాడు కుంటున్నారు. సినిమా ప్రారంభం అయిన సమయంలో బాలయ్య కాబోయే సియం అంటు ఆయన అభిమానులు పెద్ద ఏత్తున నినాదాలు చేశారు. అప్పుడు బాలయ్య వియ్యంకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడే వున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ట, రామకృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వర రావు, కళ్యాణ్ రామ్, తారకరత్నఅక్కడే వున్నారు. ఆవిషయం అభిమానులు పట్టించు కోలేదు.
తమ అభిమాన నటుడు 'సింహా'కాబోయే 'సియం' అంటూ పదేపదే నినాదాలు చేశారు. దానికి బాలయ్య నవ్వుతూ అందరికి అభివాదం చేశారు. వారిని ఎవరు వారించ లేదు. తరువాత బాలయ్య ప్రజల కోసం నరసింహా అవుతాను...నటసింహా అవుతాను....సింహా అవుతాను...బోబ్బిలిపులి అవుతాను అనే డైలాగులు చెప్పారు. ఆ సమయంలో అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. తరువాత మాట్లాడిన కోందరు పెద్దలు పరమవీరచక్ర సినిమా సూపర్ హిట్అవుతుందని అన్నారు. బోబ్బిలిపులి సినిమా ఎన్టీఆర్ జీవితంలో మైలురాయిగా నిలిచి పోయింది. అలగే పరమవీరచక్ర బాలయ్య జీవితంలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. బాలయ్య ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశానికి ఈ సినిమా తోలి మెట్టు అని కోందరు అంటున్నారు. ఇదే జరిగితే రానున్న రోజులలో బాలయ్య అభిమానులు రాజకీయ నాయకులు కానున్నారని టాక్.


Click it and Unblock the Notifications











