twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె ఒక పోరాట యోధురాలు: బాలయ్య ఆమెని ఆకాశానికి ఎత్తేసాడు

    |

    విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో శనివారం ఉదయం లైఫ్‌ ఎగైన్‌ విన్నర్స్‌ వాక్‌ నిర్వహించారు. ఈ వాక్‌ను సినీ హీరో బాలకృష్ణ, సినీ నటి గౌతమి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆర్‌కే బీచ్‌ నుంచి వైఎంసీఏ వరకు విన్నర్స్‌ వాక్‌ నిర్వహించారు. ఈ విన్నర్స్ వాక్‌లో నటసింహ బాలకృష్ణ, నటీమణి గౌతమితోపాటు ఐదు వేల మంది పాల్గొంటున్నారు.

     బయటపడిన ప్రతి వ్యక్తి ఒక విజేత

    బయటపడిన ప్రతి వ్యక్తి ఒక విజేత

    క్యాన్సర్ పట్ల అందరు అవగాహన కలిగి ఉండాలని గౌతమి అన్నారు. క్యాన్సర్ ఎవరికైనా అటాక్ కావొచ్చాని, అక్టోబర్ నెలను క్యాన్సర్ విన్నర్స్ మంత్ గా నిర్వహిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ నుంచి బయటపడిన ప్రతి వ్యక్తి ఒక విజేత అని ఆమె అన్నారు. ఈ వాక్ ద్వారా క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కలుగుతుందని గౌతమి ఆశాభావం వ్యక్తం చేశారు.

     కేన్సర్ బారిన పడి కోలుకుంది

    కేన్సర్ బారిన పడి కోలుకుంది

    సినీ నటి గౌతమి కొన్ని సంవత్సరాల క్రితం కేన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ‘లైఫ్ ఎగైన్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కేన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం - విరాళాలు సేకరించి కేన్సర్ బాధితుల చికిత్సకు ఆర్థిక సాయమందించడం వంటి పనులను ఈ సంస్థ ద్వారా ఆమె నిర్వహిస్తున్నారు.

     ఐ డోంట్ సే షీ ఈజ్ ఎ సర్వైవర్ బట్ ఎ ఫైటర్

    ఐ డోంట్ సే షీ ఈజ్ ఎ సర్వైవర్ బట్ ఎ ఫైటర్

    హైమా - మద్రాస్ టాకీస్ సహ నిర్మాత మాల లు ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. కేన్సర్ మహమ్మారిని జయించిన గౌతమి నిజమైన పోరాటయోధురాలని బాలకృష్ణ ప్రశంసించారు. భగవంతుడి ఆశీస్సులతోపాటు ఆమె పట్టుదల వల్ల కేన్సర్ బారి నుంచి బయటపడ్డారని అన్నారు. ‘ఐ డోంట్ సే షీ ఈజ్ ఎ సర్వైవర్ బట్ ఎ ఫైటర్' అని బాలయ్య....గౌతమిని కొనియాడారు.

    బసవతారకం కేన్సర్ ఆసుపత్రి

    బసవతారకం కేన్సర్ ఆసుపత్రి

    కేన్సర్ వ్యాధి బారినపడ్డవారు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ‘లైఫ్ ఎగైన్' సంస్థలు సంయుక్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విశాఖలోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీ వరకూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు.

    English summary
    Actress Gauthami is a cancer survivor and she is spreading the awareness on cancer , stating that it is a curable disease. Balakrishna takes care of Basavatarakam cancer hospital and both Gauthami and Balakrishna will be taking part in the winners walk campaign organised by Life Again .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X