అందుకే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నా.. జై సింహా ఆడియోలో బాలయ్య క్లారిటీ

By Rajababu

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 102వ చిత్రం జై సింహా ఆడియో రిలీజ్ కార్యక్రమం విజయవాడలో వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ స్వరపరిచిన పాటలు ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలయ్యాయి.

అభిమానులు, సినీ ప్రేక్షకుల ఆనందోత్సాహాల మధ్య ఈ చిత్ర ఆడియో కార్యక్రమంలో బాలయ్య ఉద్వేగంగా మాట్లాడి సంతోషపరిచారు.ఈ చిత్రంలో అనేక విభిన్నమైన అంశాలు ఉన్నాయని, దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో సినిమా చేయాలన్న ఎనిమిదేళ్ల కోరిక తీరింది అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బాలకృష్ణ వెల్లడించిన మరికొన్ని విషయాలు మీకోసం...

 జయసింహకు ముందు ఎన్టీఆర్

జయసింహకు ముందు ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నాన్న నందమూరి తారక రామారావు జయసింహ చిత్రానికి ముందు తోడుదొంగలు, పిచ్చి పుల్లయ్య అనే చిత్రాలను స్వయంగా నిర్మించారు. కానీ ఆ చిత్రాలు పెద్దగా ప్రేక్షకుల మెప్పు పొందలేదు. కానీ రాష్ట్రపతి పతకాలు వచ్చాయి.

 ఎన్టీఆర్ కసితో

ఎన్టీఆర్ కసితో

అలాంటి పరిస్థితుల్లో నిజ స్వరూపం చూపించాలని కసితో జయసింహా అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఆ చిత్ర విజయం అందించిన స్పూర్తితో మాయాబజార్‌, నర్తనశాల, పాండవ వనవాసం, దానవీరశూరకర్ణ లాంటి సినిమాలను నిర్మించారు.

 అందుకే బయోపిక్ ప్లాన్ చేశా

అందుకే బయోపిక్ ప్లాన్ చేశా

తన సినీ జీవితంలో ఎన్నో గొప్ప చిత్రాలను తీసే అదృష్టం మాత్రం ఆయనకే దక్కింది. ఆ తర్వాత ఆ అదృష్టం నాకు లభించిందను కొంటున్నాను. అలాంటి మహనీయుడి జీవితాన్ని తెరపైకి తీసుకురావడానికి రామారావు బయోపిక్‌ని ప్లాన్‌ చేశాను అని బాలకృష్ణ వెల్లడించారు.

 స్వర్గీయ ఎన్టీఆర్ అంటే..

స్వర్గీయ ఎన్టీఆర్ అంటే..

ఎన్టీఆర్ కేవలం తెలుగు జాతి మాత్రమే గుర్తుంచుకోవాల్సిన నటుడు కాదు. ఆయన గురించి యువతరానికి తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అని బాలకృష్ణ ఉద్వేగంగా మాట్లాడారు.

విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్

విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్

సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి చరిత్ర తిరగరాశారు. కూడు, గూడు, గుడ్డ లాంటి పేదల కనీస అవసరాలను తీర్చడానికి విప్లవాత్మకంగా ఆయన పలు పథకాలను తెచ్చారు. ఇవాళ ఎవరెవరైతే వాటిని తమవేనంటూ సొంతంగా జేజేలు కొట్టుకుంటున్నారో, వాళ్లందరూ ఎన్టీఆర్‌కి రుణపడి ఉండాలి అని బాలకృష్ణ అన్నారు.

 వారిద్దరు ఇండస్ట్రీకి రెండు కళ్లు

వారిద్దరు ఇండస్ట్రీకి రెండు కళ్లు

చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రెండు కళ్ల లాంటి వాళ్లు. ఎన్టీఆర్ దగ్గర క్రమ శిక్షణ, ఏఎన్నార్‌గారి దగ్గర నుంచి పొగడ్తలకి దూరంగా ఉండటం నేర్చుకున్నా అని బాలయ్య పేర్కొన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X