బాలయ్య ఈవెంట్‌కు అల్లు అర్జున్ డుమ్మా.. మరోసారి బయటపడ్డ మెగా ఫ్యామిలీతో విభేదాలు

నందమూరి బాలకృష్ణ సినీనటుడిగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మెగా ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు తరలివచ్చారు. చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, నాని తదితరులు ఈ సెలబ్రేషన్స్‌కు హాజరై బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఓ స్టార్ కోసం ప్రజలు, ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ ఆయన మాత్రం బాలయ్య ఈవెంట్‌కు రాలేదు, ఆ స్టార్ మరెవ్వరో కాదు అల్లు అర్జున్.

బాలకృష్ణ 50 ఇయర్స్ ఈవెంట్ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని టాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఆశపడ్డారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా వార్తల్లో ఒకరిగా నిలుస్తున్నారు. ఆయన ఏం మాట్లాడినా , ఏం చేసినా వివాదాస్పదమవుతోంది. బన్నీ కారణంగా అల్లు ఫ్యామిలీ - మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చెప్పను బ్రదర్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి మద్ధతు, ఓ మూవీ ఈవెంట్‌లో వ్యాఖ్యల కారణంగా అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

Nandamuri Balakrishna s Golden Jubilee Celebrations why icon star allu arjun absent for balakrishna 50 years event

మెగా కాంపౌండ్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన ఏ కార్యక్రమంలో బన్నీ కనిపించలేదు. బాలయ్య ఈవెంట్‌కు కొద్దిరోజుల క్రితం రావు రమేష్ హీరోగా నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన మనసుకు నచ్చితే ఎక్కడికైనా వచ్చేస్తానంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

సరిగ్గా ఇలాంటి వేళ బాలకృష్ణ 50 ఇయర్స్ ఈవెంట్‌కు అటెండ్ కావాల్సిందిగా అల్లు అర్జున్‌కు ఇన్విటేషన్ అందింది. అల్లు కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి దశాబ్ధాలుగా ఉన్న అనుబంధంతో పాటు అన్‌స్టాపబుల్‌ కార్యక్రమంతో బాలయ్యతో బన్నీకి రిలేషన్ పెరిగింది. ఈ బాండింగ్‌తోనే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్ వచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ 50 ఇయర్స్ మైల్‌స్టోన్‌ ఈవెంట్‌కు ఖచ్చితంగా అటెండ్ అవుతానని బన్నీ మాట కూడా ఇచ్చారట.

ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి వస్తుండటంతో మేనమామ, మేనల్లుడు ఇద్దరూ ఒకే వేదికను పంచుకుంటారని మెగా- అల్లు ఫ్యాన్స్ ఆశపడ్డారు. అదే జరిగితే మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనన్న సంకేతాలు ఇచ్చినట్లేనని సంబరపడ్డారు. కానీ కట్ చేస్తే బాలకృష్ణ 50 ఇయర్స్ ఈవెంట్‌కు చిరంజీవి ఒక్కరే హాజరై తన మిత్రుడిని అభినందించారు. బాలకృష్ణతో తాను ఓ ఫ్యాక్షన్ సినిమాను కలిసి చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు.

అయితే అల్లు అర్జున్ ఈ ఈవెంట్‌కు ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. హైదరాబాద్‌లో వర్షం పడుతున్నా , బాలయ్యతో అనుబంధం నేపథ్యంలో కార్యక్రమానికి వెళ్లి తీరాలని బన్నీ డిసైడ్ అయ్యారట. అయితే చిరంజీవి రావడంతో అల్లు అర్జున్ తన మనసు మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి- అల్లు అర్జున్‌లను పక్కపక్కన చూడాలని ఆశపడ్డ అభిమానులు ఈ ఇన్సిడెంట్‌తో బాగా డిజప్పాయింట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X