బాలయ్యతో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కోల్డ్ వార్..ఈవెంట్ గైర్హాజరు వెనుక కారణాలు ఇవే అంటూ!

నటసింహం నందమూరి బాలకృష్ణ సినీనటుడిగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరించింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. వచ్చిన గెస్ట్‌లంతా బాలయ్య నటనను, ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ ఆయనను ఆకాశానికెత్తేశారు. బాలయ్య ఇలాంటి వార్షికోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు మిస్ అయ్యారు . వారే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. వీరు ఎందుకు రాలేదంటూ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద డిస్కషన్ నడుస్తోంది.

నందమూరి కుటుంబంలో తాత తండ్రి తర్వాత బాబాయ్ బాలయ్యను ఎక్కువగా అభిమానిస్తారు జూనియర్ ఎన్టీఆర్. తాను హీరో అయిన తొలినాళ్లలో స్టేజ్‌పై బాబాయ్‌ని చూడగానే చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు జూనియర్. ఈ ఘటన ఇప్పటికీ నందమూరి ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్‌కి బాబాయ్‌కి ఈ మధ్య రిలేషన్స్ సరిగా లేవంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

Nandamuri Balakrishna s Golden Jubilee Celebrations why jr ntr and kalyan ram absent for balakrishna 50 years event

ఎన్టీఆర్ - బాలయ్య మధ్య సంబంధాలు దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్‌ను బాలకృష్ణ దూరం పెడుతున్నారని రాజకీయ వర్గాల టాక్. తన మేనత్త నారా భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానిస్తే , ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడం బాలయ్యకు ఆగ్రహం తెప్పించదని కూడా చెబుతుంటారు. టీడీపీకి చావోరేవో వంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ కనీసం మాట మాత్రంగానైనా సపోర్ట్ చేయకపోవడం కూడా తెలుగుదేశం వర్గాలను , బాలయ్యను బాగా డిజప్పాయింట్ చేసిందట.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో బాలకృష్ణ అంటీముట్టనట్లుగానే ఉంటున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్యతో వేదిక పంచుకునే అవకాశం వచ్చిన జూనియర్ దానిని స్కిప్ చేయడం ఎప్పుడూ చర్చనీయాంశమవుతోంది. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఎన్టీఆర్ డుమ్మా కొట్టడం కలకలం రేపింది. తారకరత్న పెద్దకర్మ రోజున కళ్యాణ్‌రామ్- జూనియర్ ఎన్టీఆర్‌లు పక్కనే ఉన్నా బాలయ్య కనీసం పట్టించుకోకపోవడం అదే స్థాయిలో చర్చనీయాంశమైంది.

ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి నాడు.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో కట్టిన జూనియన్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి బాలకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారు. వాటిని తీసి పారేయాలని అనుచరులకు చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఇన్ని కారణాల మధ్య బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌కు హాజరుకావాల్సిందిగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లకు ఆహ్వానం అందింది. కానీ అన్నదమ్ములిద్దరూ వేదిక వద్ద కనిపించలేదు. తన తల్లి శాలిని, భార్య ప్రణతీతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలోని పలు ఆలయాలను సందర్శిస్తుండటంతో ఈవెంట్‌కు రాలేదంటున్నారు.

అయితే సరిగ్గా బాలయ్య కార్యక్రమం ఉన్నప్పుడే ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. జూనియర్ సంగతి పక్కనబెడితే.. ఆయన అన్న, హీరో కళ్యాణ్ రామ్ ఊళ్లోనే ఉండి కూడా బాబాయ్ ఈవెంట్‌కు డుమ్మా కొట్టడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బాలయ్య - ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్డ్ మరోసారి చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X