బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం
ఈ నెల 28, 29 తేదీల్లో అమెరికాలోని కింగ్ ఆఫ్ ప్రష్యా నగరంలో జరగనున్న వేడుకల్లో.. బాలకృష్ణతోపాటు సాహిత్యం, కళలు, సామాజిక సేవా రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన 18 మంది ప్రవాసాంధ్రులను కూడా సన్మానించనున్నట్లు ఆయన వెల్లడించారు. వీరిలో డాక్టర్ గుత్తికొండ రవీంద్రనాథ్, చివుకుల ఉపేంద్ర, నరిశెట్టి రాజు, ఎన్.టి.చౌదరి తదితరులు ఉన్నారన్నారు.
సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో జరిగే సంగీత విభావరిలో సునీత, ఉష, కారుణ్య, హేమచంద్ర, శ్రీకృష్ణ, శ్రావణభార్గవి, అంజన, సౌమ్య తదితరులు తమ ప్రదర్శనలతో అలరిస్తారని వివరించారు. సినీ నటి నయనతార కూడా ఉత్సవాలకు వస్తున్నారని రవి చెప్పారు.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరనేది తెలియలేదు. కానీ ... ఎరికా ఫెర్నాండెజ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాసాలు ఉన్నట్లు సమాచారం.
బాలకృష్ణ మాట్లాడుతూ ''సింహా'ను మించి ఈ సినిమా వుంటుంది. ఇంతమంది అభిమానుల్ని పొందటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక రాష్ట్ర రాజకీయాల్లో మరో శకం ఆరంభమైంది. సంస్కరణల విప్లవకారుడు ఎన్టీఆర్. నాన్నగారి స్ఫూర్తితో అభిమానులందరూ ప్రజాసేవకు పూనుకోవాలని కోరుకుంటున్నాను' అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ 'సినిమా లాంఛనంగా ప్రారంభమైనా, అభిమానుల మధ్య ఓ షాట్ తీసుకోవాలనే బాలయ్య కోరిక మేరకు ఈ రోజు షూటింగ్‌ను ప్రారంభించాం. అభిమానుంలందరూ గర్వించేలా సినిమాను తీర్చిదిద్దుతా' అన్నారు.


Click it and Unblock the Notifications












