‘సింహా' రికార్డులని తిరగరాస్తుందని ఆనాడు చెప్పాను.. నేడది నిజమైంది: బాలయ్య!
ప్రస్తుతం 'సింహా' చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు నా శతకోటి వందనాలు. నేను మామూలుగానే ఆ మీసం, గడం పెంచాను. అదే గెటప్‌లో బయట ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నన్ను ప్రేక్షకులకు అది నచ్చి చాలా మంది నా స్టైల్ ని ఫాలో అవుతున్నారని తెలిసింది. అంతులేని అభిమానాన్ని మాపై కురిపిస్తున్న నందమూరి అభిమానులందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నేను పెంచుకున్న ఆ మీసాలు, గెడ్డం తోనే 'సింహా' చిత్రంలోని ఫ్లాష్‌బాక్ ఎపిసోడ్ పాత్రలో నటించడం జరిగింది. అందరికి ఆది ఎంతగానో నచ్చింది. సమాజంలోని కొన్ని సున్నితమైన సమస్యల్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఆది ప్రేక్షకులకు బాగా నచ్చి ప్రతి ఒక్కరూ ఈ రోజున మమ్మల్ని అభినందనల తో ముంచెత్తుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను చేసిన రెండు పాత్రలూ దేనికదే కొత్తది, ఇప్పటివరకు నేను చేయనిది. 'సింహా' చిత్ర ఆడియో విజయత్సవ సభలోనే చెప్పా..ఖచ్చితంగా 'సింహా' అన్ని రికార్డులని తిరగరాస్తుందని…నేడది నిజమైంది' అని బాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











