క్రేజ్ కోసం ఎన్టీఆర్ సినిమాలో బాలకృష్ణను నటింప చేస్తున్నారా..!?
ఏంటీ ఎన్టీఆర్ సినిమాలో బాబాయ్ బాలకృష్ణ నటిస్తున్నాడా...? అని ఆశ్చర్యపోతున్నారా. ఈ వార్త నిజమే కానీ ఇక్కడ మనం చర్చిస్తుంది జూ ఎన్టీఆర్ గురించి కాదు. కొత్తగా గన పేరును ఎన్టీఆర్ గా మార్చుకున్న తారకరత్న గురించి. టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు ఎన్టీఆర్ లు వున్నారు. ఒకరు జూ ఎన్టీఆర్ అయితే మరొకరు కొత్తగా ఎన్టీఆర్ గా మారిన నందమూరి తారకరత్న. పట్టు వదలని విక్రమార్కుడులా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తూన్నా సరైన విజయం దక్కక సఫర్ అవుతున్న తారకరత్న ఎలాగైన తన సినిమాకి క్రేజ్ రావాలని భావించి తాజాగా తను హీరోగా నటిస్తున్న నందీశ్వరుడు సినిమాలో బాబాయ్ బాలకృష్ణని గెస్ట్ రోల్ చెయ్యమని రిక్వెస్ట్ చేసాడట.
ఆల్ రెడీ మనోజ్ సినిమా ఊ కొడతారా ఉలిక్కిపడతారా లో గెస్ట్ రోల్ చేస్తున్న బాలకృష్ణ అబ్బాయ్ అడగడంతో కాదనలేక ఓకే చెప్పేసాడని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. కాగా నందీశ్వరుడు తో తారకరత్న తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్న తారకరత్న బాలయ్య అప్పీయరెన్స్ కాస్తా ఓపెనింగ్స్ పరంగా 'నందీశ్వరుడి"కి కలిసొస్తుందని భావిస్తున్నాడు తారకరత్న. మరీ ఈ కొత్త ఎన్టీఆర్(తారకరత్న)కి బాలయ్య గెస్ట్ అప్పీయరెన్స్ అయినా హీరోగా నలిలబెడ్తాయో లేదో వేచి చూడాల్సిందే....


Click it and Unblock the Notifications











