»   »  బాలయ్యకు అదే కథ చెప్పిన గుణ

బాలయ్యకు అదే కథ చెప్పిన గుణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
దర్శకుడు గుణశేఖర్ ఒక కథను తయారు చేసుకున్నాడు. ఆ సినిమా నిర్మితమయితే ఖర్చు రూ.25కోట్లు అవుతుందని కూడా గుణశేఖర్ చెబుతున్నాడు. ఇప్పటికే ఈ కథను చిరంజీవికి వినిపించిన గుణశేఖర్ ఆయన రాజకీయ రంగప్రవేశంపై బిజీగా ఉండడంతో కొత్త హీరోను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కథను ఇపుడు బాలకృష్ణకు కూడా వినిపించినట్టు సమాచారం. మూడు గంటలపాటు కథను విన్న బాలకృష్ణ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడట. సినిమా చేయాలా వద్దా అనే విషయాన్ని కొద్ది రోజుల్లో చెబుతానని బాలకృష్ణ, గుణశేఖర్ కు చెప్పాడట. పాండురంగడు సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. గుణశేఖర్ వర్కింగ్ స్టైల్ అందరికీ నచ్చదుట. మరి ఇవన్నీ ఆలోచించుకోవడానికే బాలకృష్ణ కొద్దిరోజుల సమయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఒప్పుకుంటే 2008లో భారీ సినిమాగా ఇది రూపుదిద్దుకోనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X