నా రక్తంలోనే ఉంది: బాలకృష్ణ
ఎన్టీఆర్ బిడ్డగా ఆ పాత్రకు న్యాయం చేయగలననిపించింది. బాపు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎన్టీఆర్ రక్తమే నాలో ప్రవహిస్తోందని ఆయనకు తెలుసు అంటూ ఎమోషనల్ గా శ్రీరామరాజ్యం 50 రోజుల ఫంక్షన్ లో మాట్లాడిన మాటలే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. నటన నా రక్తంలోనే ఉందని ఆయన చెప్పటం అభిమానలును ఆనందపరుస్తోంది. తన తండ్రి వారసత్వమే వచ్చిందంటూ బాలకృష్ణ.. 'జానపదమైనా, పౌరాణికమైనా, చారిత్రకమైనా, సాంఘికమైనా అన్ని రకాల పాత్రల్లో నాన్నగారు మెప్పించారు. అదంతా ఆయన మొదలుపెట్టిన ట్రెండే. ఆ దారిలోనే నేను నడుస్తున్నా.
బాపు దర్శకత్వంలో నాన్నగారు తన 52వ యేట 'శ్రీరామాంజనేయ యుద్ధంలో నటించారు. నేను కూడా ఇప్పుడు అదే వయసులో 'శ్రీరామరాజ్యం'లో నటించడం దైవసంకల్పం. 'లవకుశ' కథను మళ్లీ తీస్తానంటే నాకు ధైర్యం వచ్చింది. ఎన్టీఆర్ బిడ్డగా ఆ పాత్రకు న్యాయం చేయగలననిపించింది. బాపు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎన్టీఆర్ రక్తమే నాలో ప్రవహిస్తోందని ఆయనకు తెలుసు. మన సంస్కృతిని చాటిచెప్పే చిత్రమిది. ఈ సినిమా సాంఘికమా..? పౌరాణికమా..? అనేది చెప్పలేం. కానీ నాకు 'మాయాబజార్'లా అనిపించింది అన్నారు.


Click it and Unblock the Notifications











