మరింత తక్కువ కానున్న బాలకృష్ణ
హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ ఓ విషయంలో మరింత తక్కువ కానున్నారు. మా హీరోను తక్కువ చేసి మాట్లాడతారా అంటూ బాలయ్య అభిమానులు కోపగించుకోవద్దు సుమీ! ఎందుకంటే ఆయన తక్కువయ్యేది....ఆయన బరువు విషయంలో మాత్రమే. ఆయన ఏకంగా 8 కిలోల బరువు తగ్గారట.
ఇదంతా బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న 'లెజెండ్' సినిమా కోసమేనట. సినిమాలోని క్యారెక్టర్ కోసమే బాలయ్య బరువు తగ్గి ఫిట్‌గా తయ్యారని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య ఈ చిత్రంలో కొత్తలుక్‌తో మరింత యంగ్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టె హీరోయిన్లు. జగపతి బాబు విలన్ పాత్రలో చేస్తున్నాడు. గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. 'సింహా' తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలకృష్ణ సినిమాకు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా మ్యూజిక్‌పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు. ఈ చిత్రం సంక్రాంతి ముందుకానీ, తర్వాతగానీ విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











