సంచలన నిర్ణయం, ఎన్టీఆర్ బయోపిక్ కు బాలయ్య దర్శకత్వం!
ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తను తప్పుకున్నట్టుగా దర్శకుడు తేజ స్పష్టం చేయడం సంచలనంగా మారింది. ఆ స్థానంలో ఎవరు వస్తారని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తేజ స్థానంలో సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు ఈ సినిమా బాధ్యతలు తీసుకోనున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఆయన ఇంకా స్పష్టత లేదు.
తండ్రి బయోపిక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాలని బాలయ్య అనుకుంటున్నాడని, అందుకోసం తనే దర్శకుడిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వ్యాఖ్య వినిపిస్తోంది. ఇది వరకూ తనే దర్శకుడిగా మారి 'నర్తనశాల' సినిమాను రూపొందించాలని బాలయ్య అనుకున్నాడు కాని అది జరగలేదు. ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం బాలయ్యే దర్శకత్వం వహిస్తాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29న 'ఎన్టీఆర్ బయోపిక్' సినిమా హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో అంగ రంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముహూర్తపు క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











