ద్విపాత్రలు చేయడమంటే మహా ఇష్టమైన నందమూరి బాలకృష్ణ నిన్న(శుక్రవారం) 'అన్నన్ తంపి' అనే మలయాళ సినిమాను తిలకించారు. ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలు చూడటం ఆయనకు అలవాటు. ఏప్రిల్‌లో విడుదలై మంచి విజయం సాధించిన 'అన్నన్ తంపి' లో కవల సోదరులుగా మమ్ముట్టి ద్విపాత్రాభినయం చేసిరు. ఆయన సరసన గోపిక, లక్ష్మీరాయ్ హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణకు ఈ సినిమా బాగా నచ్చిందని సమాచారం. ముఖ్యంగా సినిమాలోని వినోదాన్ని ఆయన బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఈ సినిమాను తెలుగులో ఆయన చేసేదీ లేనిదీ తెలియాల్సి వుంది. ప్రస్తుతం బాలకృష్ణ ద్విపాత్రలు తో చేస్తున్న'పాండురంగడు' సినిమా తుదిమెరుగుల్లో నిమగ్నమై వున్నారు. అది మే 28న ఎన్టీ రామారావు జన్మదినం సందర్భంగా విడుదల కానున్నది.
Story first published: Sunday, May 17, 2026, 15:12 [IST]