మస్కా ఫ్లాఫ్ తర్వాత బి.గోపాల్ మరో చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నట్లు సమచారం. అది మరేదో కాదు బాలకృష్ణ హీరోగా యునైటైడ్ మూవీస్ పై ప్రొడక్షన్ నెంబర్-4 చిత్రానికి నిర్మించనున్న చిత్రం అని తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ కాంబినేషన్లో ఆయన ఇచ్చిన హిట్స్ 'లారీ డ్రైవర్', 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు' దృష్టిలో ఉంచుకుని ఆయనకీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిస్తోంది. అలాగే బి.గోపాల్ సైతం ఎలైగైనా మరో హిట్ తో తన కెరిర్ కి సైతం ఊపునివ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంభంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ కొత్త చిత్రం భారీ పెట్టుబడిపెట్టనున్నట్లు చెప్తున్నారు. అద్భుతమైన కథ, అత్యున్నత సాంకేతిక విలువలతో తమ కొత్త చిత్రం ఉంటుందనీ, బాలకృష్ణ ఇమేజ్ ను పెంచే విధంగా అత్యంత భారీ చిత్రంగా దీనిని రూపొందించనున్నామనీ ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు.