బాలకృష్ణకు అరుదైన గౌరవం
హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2012 ముగింపు వేడుకలకు బాలయ్యను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఇండియన్ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సారి జరుగుతున్న 43వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేకతను సంతరించుకుంది.
ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం...ఈ వేడుకకు బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞను వెంట తీసుకుని వెళతాడని, ఇదే అదునుగా అతన్ని నేషనల్ మీడియాకు సైతం పరిచయం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య సినిమాల విషయానికొస్తే...
శ్రీమన్నారాయణ తర్వాత బాలకృష్ణ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. బాలయ్యతో 'శ్రీరామరాజ్యం' నిర్మించిన యలమంచిలి సాయిబాబుతో మరో సినిమా ఉంటుందనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. బాలయ్య 100వ చిత్రంగా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












