సినిమాలు లేక విలవిలలాడుతున్నవారికి బాలయ్య బాబే దిక్కయ్యాడా
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాత తరం తరం దర్శకులకి, వారి యొక్క డ్రీమ్ ప్రాజెక్టులు చేసుకోవడానికి బాలయ్య బాబు ఒక్కడే దిక్కు అని అంటున్నారు ఫిలింవర్గాల జనాలు. డైరెక్టర్ల మీద ఉన్నటువంటి గౌరవంచేత చేస్తున్నాడో లేక వాళ్శు ఏమైనా అనుకుంటారేమోనన్న సందేహాంతోనో తనతో సినిమా తీయడానికి వెళ్శిన పాతతరం దర్శకులు అందరితో సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నారు బాలయ్య బాబు. ఇటీవల విడుదలైనటువంటి పరమవీర చక్ర వల్ల దాసరి చేతిలో చిత్తుఅయ్యాడు బాలయ్య బాబు.
అలాగే బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం లాంటి కళాఖండానికి శ్రీకారం చుట్టారు. ఇది మాత్రమే కాకుండా బి.గోపాల్, కోడిరామకృష్ణ లాంటి మహా మేదావులైనటువంటి దర్శకుల చేతుల్లో తన భవిష్యత్తుని పెట్టారు బాలయ్య బాబు. ప్రస్తుతం బాలయ్య బాబు కీర్తి కంబైన్స్ లో చేస్తున్నటువంటి సినిమా తీస్తున్న దర్శకుడు పరుచూరి మురళి కూడా ఫ్లాప్ డైరెక్టర్ అయిన విషయం మనకు తేలిసిందే. గతంలో హీరో నితిన్‌కు రెచ్చిపో లాంటి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సినిమాలు లేక విలవిలలాడుతున్నటువంటి నమిత, అమీషా పటేల్, నేహా ధూపియా, లక్ష్మీరాయ్ లాంటి వారిని బాలయ్య బాబు పిలిచి మరీ తన సినిమాలలో పెట్టుకోవడం ఆనందించదగ్గ విషయం. దీనిని బట్టి చూస్తుంటే బాలయ్య బాబు అవకాశాలు లేక వీధుల్లో తిరుగుతున్నటువంటి వారందరికి తన సినిమాలలో అవకాశాలు కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడేమోనని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











