నందమూరి బాలకృష్ణ కు నేషనల్ అవార్డు
నేషనల్ అవార్డు ఏంటి బాలయ్యకేంటి అని అనుకొంటున్నారు. అవునండి ఖచ్చితంగా యువరత్న నందమూరి బాలకష్ణ కు నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉందంటున్నారు సినీ వర్గాలు. బాలకృష్ణ తదుపరిచిత్రం లెజండ్రీ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 150వ చిత్రంగా తెరకెక్కబోతున్న 'పరమ వీర చక్ర" చిత్రం తీసి ఈ చిత్రాన్ని చలనచిత్ర పరిశ్రమకు కానుకగా ఇవ్వనున్నాడట. అయితే ఈ చిత్రం అటు బాలయ్యకు ఇటు దాసరికి డబుల్ బొనాంజా అవుతుంది. వీరి కాంబినేషన్ లో తీయబోయే చిత్రం ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొట్టేస్తాడని సినీవర్గాల్లో అప్పడే అంచనాలు మొదలైయ్యాయి. అయితే ఈ అవార్డు రియల్ లైఫ్ కాదు రీల్ లైఫ్ కు మాత్రమే...
దాసరి..చిరంజీవితో 100వ చిత్రం 'లంకేశ్వరుడు" తీయడం ఆ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకోవడం విశేషం. దాసరి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'బొబ్బిలిపులి" చిత్రంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యన్టీఆర్ లానే ఈ చిత్రం తర్వాత బాలయ్య బాబును రాజకీయాలు ఆహ్వానిస్తాయని స్వయంగా దాసరి చెప్పడం మరి వీరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో కాని ప్రచారం మాత్రం అద్భుతరేంజ్ లో జరుగుతుంది.
ప్రస్తుతం బాలయ్య 'సింహా" ఓపనింగ్స్ బాగా రాబట్టుతోండటంతో బాలకృష్ణ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొన్నది అలాగే దాసరి గారి యంగ్ ఇండియా షూటింగ్ ముగించుకొని కొద్దిరోజులలో విడుదలకు సిద్దం కానున్నది.


Click it and Unblock the Notifications











