రిస్క్‌తో గేమ్స్ ఆడుతున్న బాలయ్య!

తాజాగా మరోసారి ఇలాంటి రిస్క్ తో బాలయ్య గేమ్స్ ఆడుతున్నాడని సర్వత్రా చర్చించుకుంటున్నారు. బాలయ్య నటించిన 'శ్రీరామ రాజ్యం"సినిమా త్వరలో విడుదల కాబోతోంది. దీనికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత జయంత్ సి. పర్జానీ దర్శకత్వంలో నటించబోతున్నాడు బాలయ్య. ఈ రెండు ప్రాజెక్టులు బాలయ్య సినీ కెరియర్ కు ప్రమాదం తెచ్చి పెట్టొచ్చంటున్నారు. శ్రీరామ రాజ్యం పౌరాణిక సినిమా కావడం ఒకటయితే, దానికి దర్శకత్వం వహించిన వ్యక్తి బాపు కావడం మరో కారణం. బాపు ఒక్కప్పుడు హిట్ సినిమాల దర్శకుడే కావచ్చు. కానీ ఇప్పడు ఆయన ఔట్ డేటెడ్. ఆ మధ్య బాపు దర్శకత్వం వహించిన రాధా గోపాళం పత్తాలేకుండా పోయింది. ఇక జయంత్ సి. పర్జానీ విషయానికొస్తే ...గతంలో లక్ష్మి నరసింహ సినిమా ద్వారా బాలయ్యకు హిట్ అందించిన జయంత్, అల్లరి పిడుగు అంటూ ఓ ప్లాపును కూడా బాలయ్య ఖాతాలో వేశాడు. ఇటీవల జయంత్ దర్శకత్వం వహించిన తీన్ మార్ చిత్రం ప్లాప్ అయింది. ఈ నేపథ్యంలో బాలయ్య భవిష్యత్ ఏమిటి? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.


Click it and Unblock the Notifications











