బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం.. హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ లాండింగ్.. అసలు ఏమైందంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే అభిమానులకు విపరీతమైన ప్రేమ. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు వీర సింహా రెడ్డిగా ఈ సంక్రాంతికి సందడి చేయనున్నాడు. మొదటి సారిగా మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన చిత్రం ఈ వీర సింహా రెడ్డి.

బాలకృష్ణకు సెంటిమెంట్ గా వర్కౌట్ అయినా సింహా అనే టైటిల్ తోనే ఈ సినిమా పేరు వచ్చింది. దీంతో అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే జనవరి 6న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వస్తుండగా బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

 సింహా అనే పేరు రావడంతో..

సింహా అనే పేరు రావడంతో..

నందమూరి నటసింహం బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం వీర సింహా రెడ్డి. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందులోనూ ఈ సినిమాకు కూడా సింహా అనే పేరు రావడంతో అభిమానులు విజయం పక్కా అని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా బ్యూటిఫుల్ శృతి హాసన్ నటించింది. గోపిచంద్ సినిమాలకు శ్రుతి హాసన్ లక్కీ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.

అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం అభిమానులకు సంక్రాంతి పండుగ కానుకగా.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రం బృందం జనవరి 6న అంటే శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బి గోపాల్, బాలయ్య బాబు, శ్రుతి హాసన్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని, హనీ రోజ్ తదితరులు హాజరయ్యారు.

అనుమతులకు నిరాకరణ..

అనుమతులకు నిరాకరణ..

అయితే ముందుగా వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్ లో నిర్వహించాలను సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేసింది. కానీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో ప్రభుత్వం అక్కడ అనుమతులు నిరాకరించింది. దీంతో ఏబీఎం గ్రౌండ్‌లో పనులు నిలిపివేసి.. రాత్రికి రాత్రే మరోక ప్రదేశమైన అర్జున్ ఇన్‌ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను అట్టహాసంగా నిర్మించారు. అలాగే ఎంతో గ్రాండ్ గా వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ప్రత్యేకమైన హెలికాఫ్టర్..

ప్రత్యేకమైన హెలికాఫ్టర్..

ఒంగోలు లోని బైపాస్ రోడ్ పక్కన ఉన్న అర్జున్ ఇన్‌ఫ్రా మైదానంలో బాలకృష్ణ పాత సినిమాల్లోని క్యారెక్టర్ల కటౌట్లను భారీగా ఏర్పాటు చేశారు. సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, గౌతమీ పుత్ర శాతకర్ణి తదితర చిత్రాల్లోనే గెటప్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక శుక్రవారం నాలుగు గంటల సమయంలో ఒంగోలుకు బాలకృష్ణ ప్రయాణం కాగా అందుకోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేసింది నిర్మాణ సంస్థ.

గాలిలోకి వెళ్లిన 20 నిమిషాలకే..

గాలిలోకి వెళ్లిన 20 నిమిషాలకే..

ఈ స్పెషల్ హెలిక్యాప్టర్ లో బాలకృష్ణ, శ్రుతి హాసన్, నిర్మాత నవీన్ యెర్నేనితోపాటు పలువురు చిత్ర బృందం ఒంగోలుకు బయలు దేరారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయిన తర్వాత తెల్లారి శనివారం అంటే ఇవాళ ఒంగోలు నుంచి హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు. అయితే గాలిలోకి వెళ్లిన కాసేపటికే వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా గాల్లోకి ఎగిరిన హెలికాఫ్టర్ 20 నిమిషాల తర్వాత మళ్లీ కిందకు వచ్చింది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఎమర్జెన్సీ ల్యాండింగ్..

హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఉన్నట్లు ఫైలట్ గుర్తించారు. దీంతో ఒంగోలులోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ గ్రౌండ్ లో హెలిక్యాఫ్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. హెలిక్యాఫ్టర్ లో సాంకేతిక లోపం గుర్తించి సేఫ్ ల్యాండ్ చేశారు. దీంతో అందరు సురక్షితంగా ఉన్నారు. అయితే ఇప్పుడు హెలికాఫ్టర్ లోని సాంకేతిక లోపాన్ని సవరించే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ అది హెలికాఫ్టర్ రిపేర్ కాకపోతే.. బాలకృష్ణను హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X