బాలకృష్ణపై కుట్రకి సెంట్రల్ జైల్లో మంతనాలు

దర్శకుడు మాట్లాడుతూ.... ''యాక్షన్ తరహాలో సాగే బాలకృష్ణ మార్కు సినిమా ఇది. ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తీర్చిదిద్దుతున్నారని'' అన్నారు. సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు. అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు.
మరో ప్రక్క పూనమ్ పాండే....బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జయసింహ'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఎంపికయిందనే ప్రచారం జరుగుతోంది. నగ్నంగా ఫోటో షూట్లు, ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు, న్యూడ్ టాక్‌తో పబ్లిసిటీ పెంచుకున్న పూనమ్ పాండే ఇటీవల 'నషా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నగ్నంగా నటించడానికి, శృంగార సీన్లలో రెచ్చిపోవడానికి ఏ మాత్రం సంకోచించని పూనమ్ పాండే బాలయ్య సినిమాల్లో నటించబోతోందనే వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ సినిమాలో ఆమె ఐటం సాంగు చేయబోతోందా? లేక ఏదైనా ప్రత్యేక పాత్రలో కనిపించబోతోందా? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











