Diwali Special.. నందమూరి ఫ్యామిలీ విషెస్.. బాలయ్య అలా ఎన్టీఆర్ ఇలా!
తెలుగు ప్రేక్షకదేవుళ్లను, నందమూరి అభిమాన గణాన్ని ప్రతీ పండుగకు బాలకృష్ణ ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాడు. తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెబుతుంటాడు. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని బాలయ్య ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పోస్ట్‌లు చేస్తుంటాడు. తాజాగా దీపావళి పండుగు ప్రత్యేకతను అందరికీ తెలిసేలా ఓ శ్లోకాన్ని పోస్ట్ చేశాడు. దాని అర్థాన్ని చెబుతూ అందరికీ దీపావళి విషెస్ చెప్పాడు.

దీపావళి ప్రాముఖ్యత..
దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్, ! దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే... !! దీపం పరబ్రహ్మ సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనం, అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సకలాభీష్ట పరమార్థాలనూ సిద్ధింపజేసే పరబ్రహ్మ స్వరూపమైన ఆ దివ్య పరంజ్యోతికి ప్రణామం అని దీని భావం' అంటూ బాలయ్య వివరించాడు.
బాలయ్య అలా..
అలా దీపం, దీపావళి విశేషాన్ని చెబుతూ బాలయ్య తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే ఈ దీపావళి పండుగ మీకు అన్ని రకాలుగానూ.. అన్ని రంగాల్లోనూ విజయం చేకూరాలని కోరుతూ.. మీ నందమూరి బాలకృష్ణ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు.
ఎన్టీఆర్ ఇలా..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరికీ కౌంటర్లు వేసే ఎన్టీఆర్ ప్రత్యేక సందర్భాల్లో పోస్ట్ చేయడంలో ముందుంటాడు. పండుగలకు అందరికంటే ముందుగానే ప్రజలకు, అభిమానులకు శుభాకాంక్షలు చెబుతాడు. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు.
Recommended Video
కళ్యాణ్ రామ్ స్పెషల్ విషెస్..
నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. కానీ స్పెషల్ ఈవెంట్ల సమయంలో మాత్రం అభిమానులనుద్దేశించి పోస్ట్ పెడుతుంటాడు. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అందరూ జాగ్రత్తగా ఉండండని కోరాడు. మొత్తానికి నందమూరి హీరోల విషెస్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











